Loading video

వామ్మో… ఈ కాకి మామూల్ది కాదుగా.. వీటిని దొంగలించడమే దాని ప్రత్యేకత

|

Mar 22, 2025 | 11:32 AM

కాకులు చాలా తెలివైన పక్షులు. ఇవి మానవాళికి ఎంతగానో ఉపయోగపడతాయి. పురాణాల్లోనూ ఈ కాకికి ప్రత్యేక స్థానం ఉంది. కాకిని శనిదేవుని వాహనంగా చెబుతారు. ఇవన్నీ ఒక ఎత్తయితే దీనికి పరిశుభ్రత ఎక్కువ. ఇది మనుషులు పడేసిన తినుబండారాలను తిని దాని కడుపు నింపుకోవడంతోపాటు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది.

అలాగే కాకి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఊరందరినీ నిద్రలేపుతుంది. అలాగే ఈ కాకుల్లో ఐకమత్యం ఎక్కువ. కాకులన్నీ గుంపులుగా తిరుగుతాయి. ఒక్కకాకికి హాని కలిగినా మిగతా కాకుల రియాక్షన్‌ మామూలుగా ఉండదు. వాటికి హాని తలపెట్టిన వారిని గుర్తుపెట్టుకొని మరీ రివెంజ్‌ తీర్చుకుంటాయి. అలాంటి కాకికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ కాకి చేసిన పని ఓ అపార్ట్‌మెంట్లో ఉన్న వారందరినీ అయోమయానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మా.. ఈ కాకి ఎంత పనిచేసింది అంటూ అవాక్కవుతున్నారు. ఓ అపార్ట్‌ మెంటు వాసులు ప్రతిరోజూ మేడపైన హ్యాంగర్ల కు బట్టలు తగిలించి ఆరేసుకుంటున్నారు. సాధారణంగా బట్టలు ముడుతలు పడకుండా ఉండేందుకు, తక్కువ స్థలంలో ఎక్కువ బట్టలు ఆరేసుకునేందుకు ఇలా హ్యాంగర్లను ఉపయోగిస్తుంటారు. అలా బట్టలు ఆరేస్తున్న హ్యాంగర్లు కనిపించకుండా పోతున్నాయి. ప్రతిరోజూ హ్యాంగర్లు మాయమవుతుండటంతో ఎవరో ఎత్తుకెళ్లిపోతున్నారేమో అని అనుమానం వచ్చిన ఆ అపార్ట్‌మెంట్లోని వాళ్లు ఓరోజు మేడపైన కాపుకాసారు. ఎవరికీ కనిపించకుండా ఓమూలనుంచి గమనిస్తున్నవారికి షాకింగ్‌ దృశ్యం కనిపించింది. ఓ కాకి మేడమీద ఎవరూ లేరని నిర్ధారించుకొని నేరుగా అక్కడికి వచ్చి తాడుకి వేళాడుతున్న హ్యాంగర్‌ను నోటకరుచుకొని వెళ్లిపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కాన్ తీస్తుండగా కడుపులో.. వింత కదలికలు.. ఆస్పత్రికి వెళ్లగా..