మొసలితోనే గేమ్సా ?? ఏం జరిగిందో తెలిస్తే ఫ్యూజులవుట్ !!

|

Feb 02, 2023 | 9:35 AM

మొసలితో పెట్టుకుంటే మామూలుగా ఉండదుమరి. భూమ్మీదే ఉంది కదా.. బలహీనంగా ఉంటుంది.. ఇక్కడ మనమే కింగ్‌ అని క్రొకొడైల్‌తో గేమ్స్‌ ఆడితే కొరికి పడేస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.

మొసలితో పెట్టుకుంటే మామూలుగా ఉండదుమరి. భూమ్మీదే ఉంది కదా.. బలహీనంగా ఉంటుంది.. ఇక్కడ మనమే కింగ్‌ అని క్రొకొడైల్‌తో గేమ్స్‌ ఆడితే కొరికి పడేస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియోలో ఓ మొసలి నేలపైన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి మొసలిని చూసి ముచ్చటపడ్డాడు. దాని వీపుపైన చేత్తో నిమురుతున్నాడు. అంతే ఒక్కసారిగా వెనుదిరిగి మొసలి ఆ వ్యక్తిపై ఎటాక్‌ చేసింది. దాని వీపుపై ఉన్న అతని చెయ్యిని ఒక్క ఉదుటన పట్టుకొని కొరికి పడేసింది. అయితే అతన్ని ఆ మొసలి బెదిరించింది అనుకోవచ్చు. ఎందుకంటే అది జస్ట్‌ గీరి వదిలిపెట్టింది. గట్టిగా కొరికి ఉంటే వేరేవిధంగా ఉండేది. దాంతో అతడు కుయ్యో, మొర్రో అంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 9 వేలమందికి పైగా వీక్షించారు. అంతేకాదు అదే సంఖ్యలో లైక్‌ చేసారు. వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి ప్రమాదకర ప్రాణులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

18 ఏళ్ల యువకుడిగా మారేందుకు 45 ఏళ్ల వ్యక్తి ప్రయత్నం.. ఏడాదికి 16.3కోట్ల ఖర్చుతో..

రూ. 25 కోట్ల జాక్‌పాట్ కొట్టి.. ఆ స్టోర్ లాంఛ్ చేశాడు !!

Published on: Feb 02, 2023 09:35 AM