Dhanashree Verma: పుష్ప (Pushpa) మేనియా ఇప్పట్లో తగ్గేలా కనిపించంలేదు. తెలుగు సినిమా స్థాయిని మరోసారి జాతీయ స్థాయిలో చాటిచెప్పిందీ సినిమా. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో (AlluArjun,Sukumar) తెరకెక్కిన పుష్ప విడుదలై మూడు నెలలు గడుస్తోన్నా ఇప్పటికీ సోషల్ మీడియాలో దీని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు దక్కిన క్రేజ్ అలాంటిదిలాంటిది కాదు.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. క్రికెటర్లు కూడా పుష్ప పాటలకు స్టెప్పులేస్తూ తగ్గేదేలా అన్నట్లు రెచ్చిపోతున్నారు. మొన్నటి మొన్న టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పుష్పలోని అల్లు అర్జున్ మేనరిజాన్ని ఇమిటేట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి చాహల్ భార్య ధనాశ్రీ వర్మ కూడా వచ్చి చేరారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ధనాశ్రీ తాజాగా పుష్ప సాంగ్‌కు స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘ఏయ్ బిడ్డ ఇది నా అడ్డ’, ‘ఊ అంటావా’ పాటకు తనదైన శైలిలో కాలు కదిపి ఫిదా చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోతో పాటు ఆమె ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. తనకు డ్రామా కంటే డ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టమని, గత నెలలో ఈ రెండు పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయని పేర్కొన్నారు. ఇక ధనశ్రీ వర్మ డ్యాన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సినిమా తారలకు ఏమాత్రం తీసిపోని డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు ధనశ్రీ. మరి ఈ వీడియోను మీరూ చూసేయండి..
IRCTC Tirupati Tour: తిరుమల వెళ్లే వారికి ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ