పుట్టగొడుగుల కూర తిన్న జంట.. కాసేపటికే విషాదం వీడియో

Updated on: Aug 19, 2025 | 3:25 PM

అడవి పుట్టగొడుగులు తిని ఓ వృద్ధ జంట మృత్యువాత పడ్డారు. ఉత్తరాఖండ్‌ పౌరీ జిల్లా శ్రీకోట్ గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని పౌరి గర్‌హ్వాల్‌కు చెందిన మహావీర్ సింగ్ , సరోజినీ దేవి దంపతులు. వీరు అల్మోరా జిల్లాలోని లంగారా ప్రాంతంలో నివసిస్తూ కూలీలుగా పనిచేసేవారు. అయితే మహావీర్ సింగ్ ఆగస్టు 12న తమ దగ్గరలో ఉండే అడవిలో నుంచి పుట్టగొడుగులు తీసుకొచ్చాడు.

అదే రోజు రాత్రి దంపతులు ఇద్దరూ వాటిని వండుకుని తిన్నారు. కానీ రాత్రి భోజనం చేసిన కొంత సమయానికే వారు ఇరువురి ఆరోగ్యం క్షీణించింది. గమనించిన స్థానికులు ఇద్దరినీ అల్మోరా ఆసుపత్రికి తరలించారు. వీరు తిన్న పుట్టగొడుగులు విషపూరితం కావడంతో కొన్ని గంటల్లోనే ప్రభావం చూపాయి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. దారిలోనే భార్య సరోజినీ దేశి మృతి చెందగా, మహవీర్ సింగ్‌ను చికిత్స కోసం డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కూడా ఆగస్ట్‌ 14 మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహానికి పంచనామా, పోస్ట్‌మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. అడవులు, పొలాలు, తడి ప్రాంతాల్లో పెరిగే పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో కొన్ని అత్యంత విషపూరితమైనవిగా ఉంటాయి. వీటి గురించి తెలుసుకోకుండా తింటే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుంది. తిన్న కాసేపటికే వాంతులు, కడుపు నొప్పి, అతిసారంతోపాటు కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్, కోమాలోకి కూడా వెళ్లే ఛాన్స్‌ ఉంది. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. అందుకే అడవుల నుంచి సేకరించిన పుట్టగొడుగుల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం 

భాగస్వామి కోపంగా ఉన్నరా.. ఈ తప్పులు అస్సలే చేయకండి వీడియో!

ప్రాణం తీసిన కోడిగుడ్డు.. నోట్లో పెట్టుకోగానే వీడియో

శ్రీశైలం సమీపంలో దారుణం.. నిద్రిస్తున్న చిన్నారిని లాక్కెళ్లిన చిరుత..

వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. మూలన కనిపించింది చూసి..