Phone to CM Helpline: సీఎం హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

|

Sep 13, 2022 | 9:21 AM

మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. సీఎం హెల్ప్‌లైన్‌కి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తనకు ఒక ప్లేటు, స్పూను కావాలని, వాటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరాడు. అందుకు


మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. సీఎం హెల్ప్‌లైన్‌కి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తనకు ఒక ప్లేటు, స్పూను కావాలని, వాటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరాడు. అందుకు సీఎం హెల్ప్‌లైన్‌ కూడా అంగీకరించింది. ఆ తర్వాత అతని ఫిర్యాదును రద్దు చేసింది. అసలు విషయం ఏంటంటే..మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఛతర్‌పూర్‌ బస్టాండ్‌లోని ఓ సమోసా సెంటర్‌కు వెళ్లి సమోసా పార్శిల్‌ కావాలని అడిగాడు. ఆ దుకాణదారుడు సమోసా ప్యాక్‌చేసి అతనికి ఇచ్చాడు. అయితే అతను ఆపార్శిల్‌తోపాటు ఓ ప్లేటు, స్పూను కూడా ఇవ్వాలి, కానీ అతను ఇవ్వలేదు. దాంతో ఆ వ్యక్తి పార్సిల్‌తోపాటు ప్లేట్‌, స్పూన్ కావాల‌ని అత‌డు కోరాడు. దీనికి స‌మోసా ప్యాక్ చేసిన వ్యక్తి నిరాక‌రించాడు. అంతేకాదు పార్శిల్‌కి వాటిని ఇవ్వమని చెప్పాడు. దాంతో కస్టమర్‌కి కోపం వచ్చింది. వెంటనే సీఎం హెల్ప్‌లైన్‌కు డ‌య‌ల్ చేసి, ఫిర్యాదు చేశాడు. అందులో దయచేసి వీలైనంత త్వరగా తన సమస్యను పరిష్కరించాల‌ని కోరాడు. ఆగస్టు 30న ఈ ఫిర్యాదు చేయ‌గా, సీఎం హెల్ప్‌లైన్ కూడా ఆ ఫిర్యాదును అంగీకరించింది. అయితే, సెప్టెంబర్ 5న ఈ ఫిర్యాదును రద్దు చేశారు. ఆ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఐదు రోజులకు పైగా దాఖలయ్యిందని, దానిపైన మేధోమథనం చేసిన తర్వాతే దాన్ని క్లోజ్ చేసిన‌ట్టు సీఎంవో వ‌ర్గాలు తెలిపాయి. కాగా, ఈ వార్త సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us on