Viral: ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..

|

Oct 21, 2024 | 9:20 AM

ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందుచేస్తోంది. జనవరి 2023లో గుర్తించిన సీ/2023-ఏ3 అనే తోకచుక్క ప్రస్తుతం భారత్ నుంచి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఔత్సాహికులు దీనిని సాధారణ కళ్లతో వీక్షించవచ్చునని, ఇది మసకబారిన బంతిలా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే టెలిస్కోప్‌తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని సూచించారు. సీ/2023-ఏ3 తోకచుక్క సెప్టెంబరు 28, 2024న సూర్యుడికి దగ్గరగా చేరింది.

సీ/2023-ఏ3 తోకచుక్క సెప్టెంబరు 28, 2024న సూర్యుడికి దగ్గరగా చేరింది. ఆ రోజు నుంచి సూర్యుడికి దూరంగా కదలడం ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం భూమి నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తోకచుక్క అరుదైన ఖగోళ ఘట్టమని, మరో 80,000 సంవత్సరాల వరకు ఇది కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో ఇదే అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క అని పేర్కొన్నారు.

భారతదేశం అంతటా ఈ తోకచుక్క కనిపిస్తుందని తెలిపారు. అక్టోబర్ 14-24 మధ్య ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపిన శాస్త్రవేత్తలు, ఈ దృశ్యాన్ని తెల్లవారుజామున వీక్షించడం ఉత్తమమని సూచించారు. ఈ తోకచుక్క సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ దిశలో కూడా కనిపిస్తుందని చెప్పారు. ఈ తోకచుక్కకు సంబంధించి ఖగోళ ఫోటోగ్రాఫర్లు, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు తీసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి కొందరు ఈ ఫొటోలు తీశారు. ఈ చిత్రాలలోని తోకచుక్క పొడవాటి తోకతో మెరుస్తూ కనిపిస్తోంది. అయితే భారతదేశంలో ప్రస్తుతం ఆకాశం స్పష్టంగా ఉన్న లడఖ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి తోకచుక్క స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on