Cock – Dog: కుక్కకు సుస్సు పోయించిన కోడి.. చివరిలో ఊహించని ట్విస్ట్..
జంతువుల మధ్య వైరం ఉండటం సహజమే.. బలమైన జంతువులు చిన్న జంతువుల పై దాడి చేయడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ కొన్నిసార్లు చిన్న జంతువులు పెద్ద వాటి పై తిరగబడటం
జంతువుల మధ్య వైరం ఉండటం సహజమే.. బలమైన జంతువులు చిన్న జంతువుల పై దాడి చేయడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ కొన్నిసార్లు చిన్న జంతువులు పెద్ద వాటి పై తిరగబడటం కూడా జరుగుతుంది. ఇటీవల జంతువులకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతోన్న నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కుక్కలు మాములుగా కోడిని చూస్తే లటుక్కున్న పట్టుకొని కనిపించకుండా పారిపోతాయి. కోడి దానిని ఎదుర్కొనే ప్రయత్నం చేసినా కుక్కే గెలుస్తుంది. కానీ తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.ఈ వీడియోలో ఒక కోడి తన పై దాడి చేయడానికి వచ్చిన కుక్కను ఎదిరించింది. ఎగిరి ఎగిరి కుక్క పై దాడి చేసింది. కోడి పరాక్రమానికి కుక్క బెంబేలెత్తిపోయి, వెనక్కి తగ్గింది. అయినా కోడి మాత్రం వెనకడుగువేయలేదు. ఇక చేసేదేమీ లేక ఆ కుక్క అక్కిడి నుంచి పారిపోయింది. ఈ క్రమంలో కోడి కుక్కను వెంటపడి మరీ తరిమింది. ఈ వీడియోని ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటికే ఈవీడియోను వీక్షించిన 68 వేల మందికి పైగా లైక్ చేశారు. కోడి సాహసాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!