Himalayas: మంచు లేక బోసిపోయిన హిమాలయాలు

Updated on: Dec 20, 2025 | 7:12 PM

పశ్చిమ హిమాలయాల్లో తీవ్ర కరవు, హిమపాతం లేకపోవడంతో పర్వతాలు బోసిపోయాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వెస్టర్న్‌ డిస్టర్బెన్సస్‌ లేవు. హిమాలయ నదుల ప్రవాహం తగ్గి, వ్యవసాయం (యాపిల్ తోటలు) తీవ్రంగా నష్టపోతోంది. పర్యాటకం కూడా కుదేలైంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర నీటి సంక్షోభం తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పశ్చిమ హిమాలయాల్లో తీవ్ర కరవు ఏర్పడింది. చలికాలంలో హిమపాతం పూర్తిగా ఆగింది. సాధారణంగా మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు ఇప్పుడు బోసిపోయి, ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అక్టోబర్ 6న ఒకసారి మాత్రమే స్వల్పంగా వర్షం, మంచు కురిసాయి. ఆ తర్వాత పూర్తిగా పొడి వాతావరణమే ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. సాధారణంగా అక్టోబర్ లో వెస్టర్న్‌ డిస్టర్బెన్సస్‌ మొదలై, నవంబర్, డిసెంబర్ నాటికి భారీ హిమపాతాన్ని అందిస్తాయి. కానీ, 2024 లానే ఈ ఏడాది కూడా వాటి జాడ కనిపించ లేదు. ఈ ప్రభావం హిమాలయ నదుల ప్రవాహంపై స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగం, ముఖ్యంగా యాపిల్ తోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హిల్ స్టేషన్లు, స్కీయింగ్ రిసార్టులకు పర్యాటకుల తాకిడి తగ్గి ఆ రంగం కుదేలైంది. ఇదే పరిస్థితి కొనసాగితే, భవిష్యత్తులో హిమాలయ నదులపై ఆధారపడిన ప్రాంతాల్లో నీటి సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..

రోజుకి రూ. 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు

రొమ్ములను తీయించుకున్న ఏంజెలినా జోలీ

అది కుక్క కాదు.. నా కూతురు ! డిపెండెంట్‌ హోదా ఇవ్వాలని కోర్టుకెక్కిన మహిళ