చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే

Updated on: Jan 14, 2026 | 6:05 PM

అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారి సినిమాను వీక్షించి, ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు. "బాస్ చించేశాడు. బాస్ ఈజ్ బాస్" అంటూ చిరంజీవి పాత సినిమాల నాస్టాల్జియాను తిరిగి తీసుకొచ్చారని, సినిమా సూపర్ హిట్ అని అరవింద్ పేర్కొన్నారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారి సినిమాను వీక్షించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. AAAలో మెగాస్టార్ అభిమానులతో కలిసి సినిమా చూసిన అనంతరం అరవింద్, చిరంజీవి నటన పట్ల అద్భుతమైన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. సినిమా చూసిన తర్వాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, “బాస్ చించేశాడు. బాస్ ఈజ్ బాస్” అని చిరంజీవి నటనను కొనియాడారు. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి పాత చిత్రాలను గుర్తుకు తెచ్చే విధంగా చిరంజీవి తన నటనతో పూర్తి నాస్టాల్జియాను తిరిగి తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. “ఇది ఒక సూపర్ హిట్ ఫిలిం” అని అరవింద్ అభివర్ణించారు.

మరిన్ని వీడియోల కోసం :

నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌… మెగాస్టార్‌కి ఊరట!

 

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్

 

పండగపూట భగ్గుమంటున్న చికెన్‌, మటన్‌ ధరలు

 

ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..