87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కొత్తగా పుట్టిన కొడుకే వారసుడని షాకింగ్‌ ప్రకటన

Updated on: Dec 20, 2025 | 1:47 PM

ప్రసిద్ధ చైనా పెయింటర్ ఫ్యాన్ జెంగ్ వ్యక్తిగత జీవితం సంచలనంగా మారింది. 87 ఏళ్ల వయసులో తనకు ఒక కుమారుడు పుట్టాడని ప్రకటించారు. అదే సమయంలో, తన కూతురు, పెంపుడు కుమారుడితో సంబంధాలు తెంచుకుంటున్నట్లు తెలిపారు. తన 37 ఏళ్ల భార్యపై పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఆయన కళాఖండాల విలువ వేల కోట్ల రూపాయలున్నప్పటికీ, ఈ కుటుంబ వివాదాలు ఆయన ప్రతిభను కప్పిపుచ్చాయి.

చైనాలో పేరున్న పెయింటర్‌ ఫ్యాన్ జెంగ్ పర్సనల్‌ లైఫ్‌ సంచలనంగా మారింది. 87 ఏళ్ల వయసులో తనకు ఒక కుమారుడు జన్మించాడని ప్రకటించారు. అదే సమయంలో తన కూతురు, పెంపుడు కుమారుడితో అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రచురించింది. ఈ పరిణామంతో పెయింటర్‌గా ఆయన ప్రతిభ కంటె వ్యక్తిగత వివాదాలను తెరపైకి తెచ్చింది. ఫ్యాన్ జెంగ్ సాంప్రదాయ చైనీస్ పెయింటింగ్స్, కాలిగ్రఫీకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆయన కళాఖండాలు వేలంలో సుమారు రూ. 4,700 కోట్లు ఆర్జించాయి.ఆయన కాలిగ్రఫీకి కూడా భారీ డిమాండ్ ఉంది. డిసెంబర్ 11న సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ జెంగ్ ప్రకటన చేశారు. తన భార్య జు మెంగ్‌కు ఒక కుమారుడు జన్మించాడని, అతడే తన ‘ఏకైక సంతానం’ అని తెలిపారు. తాను, తన భార్య, కుమారుడు కొత్త ఇంట్లోకి మారామని చెప్పారు. వయసు పైబడటంతో కుటుంబ వ్యవహారాల నిర్వహణ బాధ్యతను పూర్తిగా తన భార్య అప్పగించినట్లు అన్నారు. ఆయన ప్రస్తుత భార్య వయసు 37 ఏళ్లు. అదే ప్రకటనలో, తన కూతురు, పెంపుడు కుమారుడితో పాటు వారి కుటుంబాలతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు తన కుటుంబంపై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. తన పేరు మీద వ్యవహరించడానికి తన పాత పిల్లలకు ఇచ్చిన అన్ని అధికారాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా ఫ్యాన్ జెంగ్ కుటుంబ వివాదాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో, ఆయన కూతురు మాట్లాడుతూ.. తన తండ్రిని కలవనివ్వడం లేదని, ఆయనను ప్రస్తుత భార్య తన నియంత్రణలో ఉంచుకుందని ఆరోపించారు. తన తండ్రికి చెందిన రూ. 2,400 కోట్ల విలువైన కళాఖండాలను ఆమె రహస్యంగా అమ్ముకుందని కూతురు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను ఫ్యాన్ జెంగ్ కంపెనీ అప్పట్లో ఖండించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌

మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు

Avatar 3 Review: ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ

ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు