China Rocket: చైనా రాకెట్ పేలుడు దృశ్యాలు వైరల్.! నేలపై దిగడానికి ముందు..
ల్యాండింగ్ కోసం చేసిన ప్రయోగంలో చైనా రాకెట్ ఫెయిల్ అయింది. డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ తయారుచేసిన నెబులా-1 రీయూజబుల్ రాకెట్‌కు వర్టికల్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 11 లక్ష్యాలతో వీటిని నిర్వహించగా.. వాటిలో 10 విజయవంతమయ్యాయి. కానీ, ఒకటి మాత్రం ల్యాండింగ్‌లో విఫలమైంది. తొలుత విజయవంతంగా గాల్లోకి ప్రయాణించిన రాకెట్ ల్యాండింగ్ ఫేజ్‌లో మాత్రం తడబడింది.
ల్యాండింగ్ కోసం చేసిన ప్రయోగంలో చైనా రాకెట్ ఫెయిల్ అయింది. డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ తయారుచేసిన నెబులా-1 రీయూజబుల్ రాకెట్‌కు వర్టికల్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 11 లక్ష్యాలతో వీటిని నిర్వహించగా.. వాటిలో 10 విజయవంతమయ్యాయి. కానీ, ఒకటి మాత్రం ల్యాండింగ్‌లో విఫలమైంది. తొలుత విజయవంతంగా గాల్లోకి ప్రయాణించిన రాకెట్ ల్యాండింగ్ ఫేజ్‌లో మాత్రం తడబడింది. నేలపై దిగడానికి కొన్ని క్షణాల ముందు అదుపుతప్పి పేలుడు సంభవించింది.
రాకెట్‌లో కిరోసిన్‌ను ఇంధనంగా వాడినట్లు డీప్ బ్లూ తెలిపింది. రాకెట్ తయారీ ఖర్చును గణనీయంగా తగ్గించడానికి మీథేన్, లిక్విడ్ ఆక్సిజన్ ఉపయోగాలపైనా చైనా ప్రయోగాలు చేస్తోంది. నెబులా-1లో 3డీ ప్రింటెడ్ థండర్-ఆర్1 ఇంజిన్‌ను అమర్చారు. ఇది 2,000 కిలోగ్రాముల పేలోడ్‌ను దిగువ కక్ష్యలోకి చేర్చగలదు. మొత్తం 8 టన్నుల పేలోడ్‌ను దీని సాయంతో అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఈ సంస్థ మే 2022లో కిలోమీటర్ 11 వీటీవీఎల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. చైనాలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా నిలిచింది. దీనిలోకి ఈ ఏడాది ఆగస్టు 13న భారీగా పెట్టుబడులు వచ్చాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.