తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్ బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్
తెలుగురాష్ట్రాల్లో మాంజా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వరుస ప్రమాదాలతో టెర్రర్ పుట్టిస్తోంది. నిన్నటిదాకా మాంజా తాడు.. దారినపోయేవాళ్లను ఆస్పత్రిపాలు చేసింది. ఇప్పుడు మాంజా దారం మృత్యుపాశమే అయ్యింది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో ఓ బైకర్ మెడకు చైనా మాంజా చుట్టుకుని, గొంతు కోసుకుపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
మృతుడి పేరు అద్వైక్. బీహార్ నుంచి వచ్చిన వలసకార్మికుడు. ఓ ఫ్యాక్టరీలో పని చేసుకుని బతుకునీడ్చేవాడు. పండక్కి ఊరికెళ్లి కుటుంబంతో గడపాల్సినవాడు ఇక్కడే ఉండబట్టి, ఉసురే పోయింది. మెదక్ జిల్లా చేగుంట మండలంలో మరో విషాదం. చైనా మాంజా తగిలి మణెమ్మ అనే ఓ మహిళ తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చేరింది. చిన్నశంకరంపేట మండలం చందంపేటలో జరిగిందీ ఘటన.అటు, విశాఖలో మాంజా తగిలి మాజీ సైనికోద్యోగికి తీవ్రగాయాలయ్యాయి. వెంకట్రావు అనే ఎక్స్‌సర్వీస్‌మెన్ మధురవాడలో బైక్‌పై వెళ్తుండగా మాంజా చుట్టుకుని ప్రమాదం జరిగింది. వెంటనే ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
