Viral Video: మ్యాజిక్ చూసి చింపాంజీ రియాక్షన్‌..ఏం చేసిందంటే..! వైరల్ అవుతున్న వీడియో..

|

Jan 12, 2022 | 9:00 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. వైరల్ అయ్యే వీడియోల్లో

Chimpanzee Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. సాధారణంగా కోతులు, చింపాంజీలు.. ఒకేలా ఉంటాయి. కానీ వాస్తవానికి అవి రెండు వేర్వేరు జంతువులు. ఇక చింపాంజీల వ్యవహారశైలి అచ్చం మనషుల్లానే ఉంటుంది. ఇటీవల చింపాంజీకి సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూడటానికి ఆశ్చర్యంగా ఉంటాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ తెగనవ్వుకుంటుంటారు. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో చింపాంజీ మాత్రమే నవ్వుతూ ఉంటుంది. ఈ ఫన్నీ వీడియోను చూసి చాలా మంది తెగనవ్వుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి చింపాంజీకి మ్యాజిక్ చూపిస్తాడు. అది చూసిన తర్వాత చింపాజీ చాలా సంతోషిస్తూ కిందపడి మరి నవ్వుతుంది. ఒక వ్యక్తి చేతిలో గ్లాస్ ఉంటుంది. దానిని చింపాంజీకి చూపిస్తూ మ్యాజిక్ చేసే వ్యక్తి లోపల ఏదో పెట్టి మూత పెట్టడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. తర్వాత కాసేపు గ్లాసును అటుఇటు కదిలిస్తాడు. ఆ తర్వాత మూత తెరిచి చింపాంజీకి గ్లాస్ చూపించాడు. అయితే.. ఆ గ్లాసులో ఏమీ ఉండదు. ఈ మాయాజాలాన్ని చూసిన చింపాంజీ సంతోషంతో కిందపడి మరి నవ్వుకుంటుంది.