Chickens auction: ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.

|

Aug 08, 2024 | 10:00 PM

పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఓ వింత సంఘటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. పోలీసులే దగ్గరుండి పందెం కోళ్లను బహిరంగ వేలం వేశారు. పోలీసులేంటి, కోళ్లను వేలం వేయడం ఏంటని ఆశ్చర్యపోకండి.. కోర్టు ఆదేశాలతోనే ఇదంతా జరిగింది. విషయం మొత్తం తెలిస్తే అసలు సంగతి అర్థమవుతుంది. గత నెల 27న కమాన్‌పూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచికల్ పేట శివారులో కోడి పందేలు ఆడేవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఓ వింత సంఘటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. పోలీసులే దగ్గరుండి పందెం కోళ్లను బహిరంగ వేలం వేశారు. పోలీసులేంటి, కోళ్లను వేలం వేయడం ఏంటని ఆశ్చర్యపోకండి.. కోర్టు ఆదేశాలతోనే ఇదంతా జరిగింది. విషయం మొత్తం తెలిస్తే అసలు సంగతి అర్థమవుతుంది. గత నెల 27న కమాన్‌పూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచికల్ పేట శివారులో కోడి పందేలు ఆడేవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ లో కోళ్లకు ప్రత్యేకంగా బోను ఏర్పాటు చేసి.. వాటికి ఆహారాన్ని పెట్టటం.. మంచినీళ్లు ఇవ్వటం చేస్తూ.. వాటి సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ఈ విషయాల్ని తెలియజేయగా.. ఈ పందెం కోళ్లను బహిరంగ వేలంలో అమ్మేయాలని కోర్టు ఆదేశించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో బహిరంగ వేలం వేశారు. ఇందులో ఒక కోడి 4వేలు, మరో కోడి 2,500కు అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటి వేలం జరగకపోవటంతో చుట్టుపక్కల వారంతా పందెం కోళ్ల వేలం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on