Shivaji – Wagh Nakh: భారత్‌కు శివాజీ ‘పులి గోళ్లు’..! పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి.

|

Oct 03, 2023 | 1:22 PM

ఛత్రపతి శివాజీ 17వ శతాబ్దంలో ఉపయోగించినట్లుగా భావిస్తున్న పులి గోళ్లు లేదా వాఘ్‌ నఖ్‌ అనే ఆయుధం భారత్‌కు తిరిగి రానుంది. ప్రస్తుతం లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌ మ్యూజియంలో ఇది ఉంది. ఈ ఏడాదితో శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లండన్‌ నుంచి తీసుకొచ్చి మూడేళ్లపాటు పలుచోట్ల ప్రదర్శించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సధీర్‌ ముంగంటివార్‌ లండన్‌లోని మ్యూజియం..

ఛత్రపతి శివాజీ 17వ శతాబ్దంలో ఉపయోగించినట్లుగా భావిస్తున్న పులి గోళ్లు లేదా వాఘ్‌ నఖ్‌ అనే ఆయుధం భారత్‌కు తిరిగి రానుంది. ప్రస్తుతం లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌ మ్యూజియంలో ఇది ఉంది. ఈ ఏడాదితో శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లండన్‌ నుంచి తీసుకొచ్చి మూడేళ్లపాటు పలుచోట్ల ప్రదర్శించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సధీర్‌ ముంగంటివార్‌ లండన్‌లోని మ్యూజియంతో మంగళవారం ఒప్పందం చేసుకోనున్నారు. 1659లో జరిగిన యుద్ధంలో బీజాపుర్‌ సైన్యానికి చెందిన కమాండర్‌ అఫ్జల్‌ ఖాన్‌ను శివాజీ ఈ ఆయుధాన్ని ఉపయోగించే చంపారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆ ఆయుధం 1818లో సతారా స్టేట్‌కు ఈస్టిండియా కంపెనీ తరఫున రెసిడెంట్‌ అధికారిగా ఉన్న జేమ్స్‌ గ్రాంట్‌ డఫ్‌ అధీనంలోకి వెళ్లిందని, అతని వారసుల ద్వారా వీ అండ్‌ ఏ మ్యూజియానికి చేరిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ ఆయుధానికి అమర్చిన ఫలకంపై ప్రస్తావించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..