Chenab Rail Bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..

|

Jun 17, 2024 | 12:15 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై ఈ నిర్మాణం చేపట్టారు. ఈ వంతెన ద్వారా రాంబన్‌ నుంచి రియాసికి రైలు సర్వీస్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర రైల్వేశాఖ వెల్లడించింది. దీంతో జమ్మూకశ్మీర్‌ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై ఈ నిర్మాణం చేపట్టారు. ఈ వంతెన ద్వారా రాంబన్‌ నుంచి రియాసికి రైలు సర్వీస్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర రైల్వేశాఖ వెల్లడించింది. దీంతో జమ్మూకశ్మీర్‌ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది. భారత్‌లో ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కత్రా.. కశ్మీర్‌ లోయలోని బారాముల్లా నుంచి సంగల్దాన్‌ వరకు రైల్వే సేవలు కొనసాగుతున్నాయి. తాజాగా పూర్తయిన ఈ నిర్మాణం.. ప్రయాణాలకు అవస్థలు పడుతున్న ప్రజలకు సేవ అందించనుంది.

‘‘ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా నిలువనుంది. ఈ బ్రిడ్జి ఇంజినీర్ల ప్రతిభకు అద్దం పడుతోంది. ఇది గర్వించదగిన క్షణం. ఈ కట్టడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది’’ అని రియాసి డిప్యూటీ కమిషనర్‌ విశేశ్‌ మహాజన్‌ పేర్కొన్నారు. రైలు మార్గం ద్వారా కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది భాగం. చీనాబ్‌ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్‌ నదిపై 275 మీటర్లు ఎత్తులో ఉన్న షుబాయ్‌ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. ఈ బ్రిడ్జ్‌ నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో సిద్ధమై సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.