Students: విద్యార్థుల శ్రమదానంతో ఆ సమస్యకు చెక్..! విద్యార్థులను అభినందించిన స్థానికులు.

|

Oct 13, 2023 | 4:23 PM

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని వారంతా ఎదురుచూడలేదు. తమ సమస్య పరిష్కారానికి స్టూడెంట్స్‌ అంతా కలిసి రంగంలోకి దిగారు. ఎన్నాళ్లగానో వేధిస్తున్న సమస్యకు గంటల్లోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులు చేసిన శ్రమదానమే దీనికి నిదర్శనం. అందుకే వారి సమస్యను వారే పరిష్కరించుకున్న తీరు.. స్థానికంగా స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని వారంతా ఎదురుచూడలేదు. తమ సమస్య పరిష్కారానికి స్టూడెంట్స్‌ అంతా కలిసి రంగంలోకి దిగారు. ఎన్నాళ్లగానో వేధిస్తున్న సమస్యకు గంటల్లోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులు చేసిన శ్రమదానమే దీనికి నిదర్శనం. అందుకే వారి సమస్యను వారే పరిష్కరించుకున్న తీరు.. స్థానికంగా స్ఫూర్తిదాయకంగా నిలిచింది. జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన బాలయేసు హై స్కూల్ విద్యార్థులు, ఉపాద్యాయ బృందం చేసిన ఈ శ్రమదానం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సమీప గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చే రహదారి గుంతలమయం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల కరస్పాండెంట్‌ బ్రదర్‌ ఏసురాజు ప్రోత్సాహంతో విద్యార్థులు స్వచ్చందంగా రంగంలోకి దిగారు. చీపుర్లు పట్టుకుని రోడ్డును ఊడ్చేశారు. తట్టాపార పట్టి మట్టితో రోడ్డును చదును చేశారు. చూస్తుండగానే రోడ్డు అద్దంలా మెరిసిపోయింది. విద్యార్థులు శ్రమదానం ద్వారా తమ సమస్యను పరిష్కరించుకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. చదువుతో పాటు సామాజిక స్పృహ, సేవాగుణం నేర్పుతున్న ఉపాధ్యాయులను స్థానికులు అభినందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 13, 2023 04:22 PM