Goat Milk for dengue: మేక పాలతో డెంగ్యూకు చెక్‌..? ఈ దెబ్బకు లీటర్‌ పాలు రూ. 400.! నిపుణుల మాటేంటంటే..(వీడియో)

|

Jan 06, 2022 | 9:14 AM

మామూలుగా లీటర్ మేక పాలు 30 రూపాయలకే దొరికేస్తాయి. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో లీటర్‌ మేక పాలు 400ల రూపాయల పెట్టినాగానీ దొరకట్లేదు. ఎప్పుడూలేనిది ఇప్పుడే ఎందుకని.. ఇంతలా మేకపాలకు డిమాండ్‌ పెరిగిందంటే..


మామూలుగా లీటర్ మేక పాలు 30 రూపాయలకే దొరికేస్తాయి. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో లీటర్‌ మేక పాలు 400ల రూపాయల పెట్టినాగానీ దొరకట్లేదు. ఎప్పుడూలేనిది ఇప్పుడే ఎందుకని.. ఇంతలా మేకపాలకు డిమాండ్‌ పెరిగిందంటే.. ఇందుకు కారణం డెంగ్యూ కేసులు పెరగడమే అని తెలుస్తోంది. అవును మీరు విన్నది నిజమే.. ఇంతకీ డెంగ్యూ కేసులు పెరగడానికి, మేక పాలకు సంబంధం ఏంటో మీరే చూడండి. డెంగ్యూ వచ్చిన పేషెంట్లలో ప్లేట్ లెట్లు అమాంతం పడిపోతుంటాయి. ఆ రక్తకణాలు పడిపోకుండా, మెరుగైన సంఖ్యలో ఉంచేందుకు మేక పాలు దోహదపడతాయని ఛత్తర్ పూర్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు చెప్పడంతో.. జనాలు మేకపాల కోసం ఎగబడుతున్నారు. అనుకోకుండా పెరిగిన ఈ డిమాండ్ తో వ్యాపారులూ ధరలు బాగా పెంచేశారు. అయితే డెంగ్యూ వచ్చిన రోగులు మేక పాలు తాగితే మంచిదేగానీ.. అదే డెంగ్యూను పూర్తిగా తగ్గిస్తుందనుకోవడం మాత్రం పొరపాటని తెలిపాడు డాక్టర్ అభయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఛత్తర్ పూర్‌లో డెంగ్యూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వాసుపత్రిలోనే 20 దాకా కేసులున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ జనం చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనాలు మేకపాలపై దృష్టి పెడుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Published on: Jan 06, 2022 09:09 AM