మ్యాన్‌ఈటర్ ను పట్టుకున్న అధికారులు వీడియో

Updated on: May 16, 2025 | 8:03 PM

మహారాష్ట్రలో ఇటీవల ముగ్గురు మహిళలను అతమాఱ్చిన పులిని అటవీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. మే 15న తునికాకు శేకరణకు వెళ్ళిన ముగ్గురు మహిళలపై ఒక పులి తన పిల్లలతో కలిసి దాడి చేసి అతమాఱ్చింది. దీంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ట్రాప్ లైవ్ కెమెరాలు అమర్చి 62 మంది సిబ్బందితో గాలించారు. మూడు రోజుల తర్వాత డోంగర్గావ్ అటవీ ప్రాంతంలో పులి కదలికలను గమనించి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి స్పృహలోకి తేజారూ.

అనంతరం చంద్రపూర్ లోని ప్రత్యేక కేంద్రానికి తరలించినట్లు ఈఆర్వో విశాల్ సాల్కర్ తెలిపారు. దాన్ని పిల్లల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చంద్రపూర్ జిల్లాలో ఇటీవల భువనేశ్వరి భేంద్రే అనే 37 ఏళ్ళ మహిళ పులి దాడిలో మృతి చెందింది. బదురుని గ్రామానికి చెందిన భేంద్రే తన కుటుంబంతో కలిసి టెండు ఆకులు శేకరిస్తుండగా ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పులి ఆమెపై దాడి చేసింది. ఈ ఘటన తడోబా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ లోని ముల్లు అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలో తరచుగా అటవీ జంతువులు మనుషులపై దాడి చేస్తుంటాయి. మే 10వ తేదీన సింధువాహి అటవీ ప్రాంతంలో టెండు ఆకులు శేకరిస్తున్న ముగ్గురు మహిళలు పులి దాడిలో మరణించడం స్థానిక గ్రామాల్లో కలకలం రేపాయి.