Viral: పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..

Updated on: Oct 13, 2024 | 12:00 PM

తూర్పుగోదావరి జిల్లా తునిలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళ మెడలోంచి తాళిబొట్టును లాక్కెళ్లిపోయారు. అదికూడా మరోచోట బైక్‌ కొట్టేసి దర్జాగా ఆ బైక్‌పైన వచ్చి మహిళ మెడలో గొలుసు కొట్టేశారు. దీనిక సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో స్థానికులు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని వెలమ కొత్తూరు గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ పోస్ట్‌ ఆఫీసు వీధిలో ఏవో సామాన్లు తీసుకొని నడచుకుంటూ వెళ్తోంది. ఆ వీధిలో జనసంచారం కూడా పెద్దగా లేదు. అడపాదడపా ద్విచక్రవాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో మహిళ నడిచి వెళ్తుండగా ఎదురుగా ఓ బైక్‌పైన ఇద్దరు యువకులు వచ్చారు. మహిళ దగ్గరకు రాగానే బైక్‌ వెనుక కూర్చున్న వ్యక్తి మహిళ మెడలో చైన్‌ లాగేసాడు. మహిళ కేకలు వేస్తూ ఆ బైక్‌ వెనుక పరుగెత్తింది. ఇంతలో మరో మహిళ స్కూటీపై వస్తూ దొంగలను వెంబడించే ప్రయత్నం చేసింది. ఇంతలో స్థానికంగా ఉన్న ఓ ఇంట్లోంచి ఓ యువకుడు పరుగెత్తుకొచ్చాడు. అప్పటికే దొంగలు బైక్‌పై ఉడాయించారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. అయితే ఆ దొంగలు వచ్చిన బైక్‌ కూడా విశాఖపట్నంలోని ఓ ఇంట్లోంచి కొట్టుకొచ్చినట్టు తెలిసింది. అదే వాహనంపై తిరుగుతూ మహిళ మెడలో ఆభరణాలు లాక్కొని పరారయ్యారు. అనంతరం ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us