Viral Video: అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. చీ చీ ఇదేం పాడు పని.. సీసీ కెమెరా చూడగా
దొంగలు బాబోయ్ దొంగలు.. తాజాగా పశువలు దొంగలు సైతం పెరిగిపోయారు. రెక్కీ నిర్వహించి.. రాత్రి వేళ పశువులును దొంగతనంగా తోలుకెళ్తున్నారు. తాజాగా కర్నాటకలో మూడు గోవులను ఇలానే తోలుకెళ్లారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు తెలుసుకుందాం పదండి ..
బెంగళూరు మాదనాయకనహళ్లిలో పరిధిలో పశువుల దొంగలు హల్‌చల్ చేశారు. కిట్టనహళ్లి ప్రాంతంలో దొంగలు పశువులను దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దొంగలు రెండు రోజుల పాటు ఆ ప్రాంతంలో నిఘా ఉంచి రాత్రిపూట పశువులను దొంగతనంగా తోలుకెళ్లినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇళ్ల ముందు కట్టివేసిన పశువులను దొంగిలించే ముఠా ఈ ప్రాంతంలో తరుచుగా సంచరిస్తున్నట్లు చెబుతున్నారు.
కిట్టనగల్లి గ్రామంలో ఇంటి ముందు కట్టివేసిన ఆవులను దొంగిలించారు. గ్రామానికి చెందిన కృష్ణప్పకు చెందిన 12 ఆవులలో మూడింటిని తోలుకెళ్లారు. ఈ మూడు ఆవులలో, ఒకటి రెండు నెలల్లో దూడను ప్రసవించవలసి ఉంది. మిగతా రెండు ఆవులు ఇంటిని నడపడానికి తగినంత ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. గోవుల దొంగతనానికి సంబంధించి మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
Published on: May 18, 2025 10:33 AM