Cat Job: సెక్యూరిటీ గార్డు‌గా పిల్లి.. జీతం ఎంతో తెలుసా.? వీడియో.

|

Jul 30, 2024 | 5:57 PM

పిల్లికి.. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం. ఎస్.. మీరు వింటున్నది నిజమే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్లో కార్గొపార్సిల్ సర్వీస్ సెంటర్లో విధులు నిర్వహిస్తోంది. ఇప్పుడు పిల్లి డ్యూటీ చేస్తున్న వీడియో సోషల్ మీడియా తెగ హల్ చల్ చేస్తోంది. నిజానికి బస్టాండ్ లో ఉన్న కార్గో పార్సిల్ సర్వీస్ కార్యాలయంలో వస్తువులను ఎలుకలు తరచు డ్యామేజ్ చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు అక్కడ ఉంటున్న ఇంచార్జీతో గొడవ పడటం సర్వ సాధారణంగా మారిపోయింది.

పిల్లికి.. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం. ఎస్.. మీరు వింటున్నది నిజమే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్లో కార్గొపార్సిల్ సర్వీస్ సెంటర్లో విధులు నిర్వహిస్తోంది. ఇప్పుడు పిల్లి డ్యూటీ చేస్తున్న వీడియో సోషల్ మీడియా తెగ హల్ చల్ చేస్తోంది. నిజానికి బస్టాండ్ లో ఉన్న కార్గో పార్సిల్ సర్వీస్ కార్యాలయంలో వస్తువులను ఎలుకలు తరచు డ్యామేజ్ చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు అక్కడ ఉంటున్న ఇంచార్జీతో గొడవ పడటం సర్వ సాధారణంగా మారిపోయింది. కార్గో సర్వీస్ కొచ్చే పార్సెల్స్‌ను బస్సులలో లోడింగ్ చేసే హమాలీలు కూడా దీర్ఘాలోచనలో పడ్డారు. అనుకోకుండా ఓ రోజు ఒక పిల్లి కనబడటంతో దీంతో వర్కౌట్ అవుతుందనుకొని భావించి దాన్ని ఆ కార్గో ఆఫీసులోనే పెంచడం మొదలుపెట్టారు. ఆఫీసులో ఎలుకల సమస్యలను పిల్లి తీర్చడంతో అందరూ హ్యాపీ. దీంతో దానికి అక్కడ వీఐపీ ట్రీట్మెంట్ మొదలైంది. హమాలీలంతా రెండు పూటలా పాలు ఇస్తూ దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అది కూడా అంతే విశ్వాసంగా అక్కడ ఎలుకల బాధ లేకుండా చేస్తూ బాధ్యతగా వ్యవహరిస్తూ వస్తోంది. అక్కడ కార్గో సర్వీస్ ఇంచార్జ్, హమాలీలు ఆ పిల్లి పట్ల అత్యంత ప్రేమను చూపించేవారు. దీంతో ఆ పిల్లి కూడా అక్కడే ఉంటూ రాత్రింబవళ్లు కాపలా కాస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.