Cake Cancer: వామ్మో.! తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా.? 12 రకాల కేకుల్లో క్యాన్సర్..

|

Oct 05, 2024 | 3:39 PM

కేక్‌ అనగానే అందరికీ నోరూరుతుంది. ఏ అకేషన్‌ వచ్చినా కేక్‌ ముక్కలు కావాల్సిందే. అంతగా కేక్‌ జీవితంలో భాగమైపోయింది. అయితే నాణేనికి మరోవైపు చూస్తే కేక్‌ల తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్‌ కారక అంశాలు ఉన్నట్లు కర్నాటక రాష్ట్ర ఆహార భద్రత, నాణ్యత శాఖ తెలిపింది. కొన్ని రోజుల క్రితమే గోబీ మంచూరియా, కబాబ్, పానీపూరీ తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్‌ కారకాలు..

కేక్‌ అనగానే అందరికీ నోరూరుతుంది. ఏ అకేషన్‌ వచ్చినా కేక్‌ ముక్కలు కావాల్సిందే. అంతగా కేక్‌ జీవితంలో భాగమైపోయింది. అయితే నాణేనికి మరోవైపు చూస్తే కేక్‌ల తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్‌ కారక అంశాలు ఉన్నట్లు కర్నాటక రాష్ట్ర ఆహార భద్రత, నాణ్యత శాఖ తెలిపింది. కొన్ని రోజుల క్రితమే గోబీ మంచూరియా, కబాబ్, పానీపూరీ తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు గుర్తించి ఈ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడు కేక్‌ల గురించి ప్రకటన చేసింది. బెంగళూరులోని కొన్ని బేకరీలలో కేక్‌లను పరీక్షించగా 12 రకాల కేక్‌లలో క్యాన్సర్‌ను కలిగించే కారకాలు ఉన్నట్లు గుర్తించినట్లు కర్నాటక రాష్ట్ర ఆహార భద్రత, నాణ్యత శాఖ షాకిచ్చింది. వాటిలో వాడే రంగులు ప్రమాదకరమని తెలిపింది. కేక్‌ల తయారీలో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించాలని బేకరీలకు అధికారులు హెచ్చరించారు. క్యాన్సరే కాకుండా శారీకర, మానసిక అనారోగ్యాలకూ కారణమవుతాయని తేల్చారు.

ఈ సమాచారంతో కేక్‌ ప్రియుల్లో కలవరం ఏర్పడింది. అందరూ కూడా ఎప్పుడో ఒకసారి కేక్‌ను తినేవారే. రెడ్‌ వెల్వెట్, బ్లాక్‌ ఫారెస్ట్‌ సహా అనేక కేక్‌లు ఆకర్షణీయంగా ఉండేలా పలు రంగులను కలుపుతారు. ఈ కృత్రిమ రంగుల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కృత్రిమ రంగులను వాడకూడదని, ఆరోగ్య సూత్రాలను పాటించాలని పలుమార్లు దుకాణ యజమానులను హెచ్చరించినా వాటిని బేఖాతరు చేస్తున్నారని ఆహార భద్రతా అధికారులు తెలిపారు. చాలా కేకుల్లో క్యాన్సర్‌ కారకాలను అధికారులు గుర్తించారు. ప్రధానంగా రెడ్‌వెల్‌వెట్‌ , బ్లాక్‌ఫారెస్ట్‌ కేకుల్లో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రతీ నెలా ఆహార పదార్థాలను పరీక్షలకు పంపించి నివేదికలు తెప్పించుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు చెప్పారు. హోటల్, బేకరీల నుంచి శాంపుల్స్‌ను సేకరించి తనిఖీలు చేస్తామని అన్నారు. ఆహారం నాణ్యతగా ఉండాలనీ ఒకవేళ క్వాలిటీ లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. అలూర రెడ్‌ కలర్‌తో అలర్జీ, ఆస్తమా, జీర్ణక్రియ సమస్యలు, తలనొప్పి వస్తే… సన్‌సెట్‌ ఎల్లో ఎఫ్‌సీఎఫ్‌ కలర్‌తో అలర్జీ, హైపర్‌ యాక్టివిటీ, క్రోమోజోమ్‌ డ్యామేజీ, థైరాయిడ్‌ సమస్య, మానసిక ఒత్తిడి కలుగుతాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.