రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది. బయటకు వస్తున్న కొందరు వ్యక్తులు గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ ఘటన జరిగింది.
జూన్ 30వ తేదీన రాత్రివేళ జాతీయ రహదారి పక్కన ఉన్న రెస్టారెంట్ కస్టమర్లతో సందడిగా ఉంది. ఆహారం తిన్న తర్వాత కొందరు వ్యక్తులు బయటకు వస్తున్నారు. మరికొందరు రెస్టారెంట్ ముందు కూర్చున్నారు. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న స్విఫ్ట్ కారు అదుపుతప్పింది. రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న వారి మీదకు అది దూసుకెళ్లింది. దీంతో వారు గాల్లోకి ఎగిరిపడ్డారు. రెస్టారెంట్ గోడను ఢీకొట్టిన తర్వాత ఆ కారు ఆగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే కారు నంబర్‌ప్లేట్ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించి అరెస్ట్ చేసారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం :
కస్టమ్స్ చేతికి చిక్కిన 16 అరుదైన పాములు వీడియో
సారీ నాన్న.. ఇక భరించలేను..! పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూ*సైడ్ వీడియో
మా అమ్మ చనిపోదామంటోంది… ఆదుకోండి కలెక్టర్‌కు బాలుడు విజ్ఞప్తి వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
