భార్య ‘బంగారం’ కోసం 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టాడు

Updated on: Sep 01, 2025 | 7:56 PM

కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలో తన సతీమణి పొగొట్టుకున్న ‘పెళ్లి ఉంగరాల’ కోసం ఓ వ్యక్తి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఇందుకోసం దాదాపు 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టాడు. అసలేం జరిగిందంటే.. స్టీవ్‌ వాన్‌ భార్య జిన్నీన్‌ చేతిలో ఉన్న పాప్‌కార్న్‌ కిందపడి చెల్లాచెదురైంది. వాటిని సేకరించి చెత్త సంచిలో వేసేటప్పుడు ఆమె చేతికి ఉన్న ఉంగరాలూ అందులో పడిపోయాయి.

ఆ సమయంలో ఆ విషయాన్ని ఆమె గుర్తించలేదు. తర్వాత పారిశుద్ధ్య కార్మికులు ఆ బ్యాగును తీసుకెళ్లిపోయారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత.. కచ్చితంగా అవి ఏ సమయంలో కనిపించకుండా పోయాయో కన్ఫమ్‌ చేసుకున్నారు. చేతి ఉంగరాలు రెండు పాప్‌కార్న్‌ సంచిలోనే పడిపోయినట్లు అంచనాకు వచ్చారు. అయితే, అప్పటికే ఆ చెత్తను డంపింగ్‌ యార్డుకు తీసుకెళ్లిపోయారు. అవి దొరక్కపోవచ్చని జిన్నీస్‌ సందేహం వ్యక్తం చేసినప్పటికీ.. భర్త మాత్రం వదిలిపెట్టలేదు. మరుసటి రోజు స్థానిక డంపింగ్‌ యార్డుకు వెళ్లిన స్టీవ్ వాన్‌.. జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో ఆ ఉంగరాలను వెతుక్కునేందుకు వారు అంగీకరించారు. గ్లౌజ్‌లు ధరించి, పార చేతపట్టి ఉంగరాల కోసం వేట మొదలుపెట్టాడు. అతడి ప్రయత్నాలు ఫలించకపోవచ్చని అక్కడున్న వారు డౌట్‌ పడినప్పటికీ.. అతను వెనక్కి తగ్గలేదు. డంపింగ్‌ యార్డు కాంట్రాక్టర్‌ ఏం చెప్పారంటే…. అలా వెతకడానికి బదులుగా భార్యకు కొత్త ఉంగరం కొనివ్వడం ఉత్తమం అని స్టీవ్ వాన్‌కు చెప్పాలని అనుకున్నాడట. అయితే, స్టీవ్ పట్టుదలను చూసి తన జేసీబీతో వ్యర్థాలు తొలగించి సాయం చేశానని అన్నాడు. చివరకు కొన్ని కవర్లను గుర్తించిన స్టీవ్ వాన్‌ కు అందులో ముందు ఓ ఉంగరం తర్వాత మరో ఉంగరం లభించాయి. దీంతో అతడు ఫుల్ గా ఖుషీ అయ్యాడు. మొత్తానికి భార్య అంటే ప్రేమ ఉన్నవారు.. ఉంగరాలు వెదక్కుండా ఎలా ఉండగలరు అన్న కామెంట్ వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్‌ 7న డోంట్‌ మిస్‌

Upasana Konidela: ఈ స్థాయి ఎవరో ఇచ్చింది కాదు.. నాకు నేనుగా సాధించుకున్నది

4 నెలల్లో 6G వస్తోంది..ప్రధాని మోదీ కీలక ప్రకటన

Balakrishna: వరద బాధితులకు అండగా.. విరాళం ప్రకటించిన బాలయ్య

‘మిస్‌ అవుతున్నా నాన్నా..’ గౌతమ్‌ బర్త్‌ డే వేళ మహేష్ ఎమోషనల్