Chaganti Koteswara Rao: చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఒక ప్రవచన కర్తకు కీలకమైన నామినేటెడ్ పదవీ ఇచ్చింది. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేరు అది. విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించే ప్రభుత్వ సలహాదారు గా ఆ పదవి ఉంది. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పిలుచుకున్నారు ఆ పదవి వల్ల తమ అవకాశాలు పోవని,
చాగంటి కోటేశ్వరరావుకి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇదే పదవిని ఆఫర్ చేసింది. 2014 -19 మధ్య కాలంలో ఆనాటి టిడిపి ప్రభుత్వం చాగంటిని ఈ బాధ్యతలు తీసుకోవాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పినా చేస్తాను కానీ తనకు ప్రత్యేకంగా పదవేమీ వద్దంటూ సున్నితంగా తిరస్కరించారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి కూడా సవినయంగా తెలియజేశారు. తనకు పదవులు పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని, అందులోనూ ప్రభుత్వం ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వెనకంజ వేయనంటూ అప్పట్లో చెప్పారు చాగంటి .
గతంలో ఇదే పదవిని అంగీకరించని చాగంటి ఈసారైనా అంగీకరిస్తారా లేదా అన్న సంశయం అందరిలో నెలకొని ఉంది. అయితే ప్రభుత్వం ఆయన పేరుని జాబితాలో ప్రకటించే ముందే ఆయన్ని సంప్రదించే ఇచ్చి ఉంటుంది కదా అన్న సందేహం కూడా అందరిలో ఉంది. దీనిపై చాగంటి కోటేశ్వరరావు స్పందించే వరకు స్పష్టత రాదు కానీ ప్రభుత్వం ఆయన్ని పిలిచి ఇలాంటి సహకారం అందించాలంటే కచ్చితంగా అంగీకరించే అవకాశం ఉంటుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.