Hyderabad: గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..

Hyderabad: గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..

Anil kumar poka

|

Updated on: Nov 13, 2024 | 12:07 PM

హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లో పైపులకు భారీ లీకులు పడ్డాయి. క‌ల‌బ్ గూర్ నుంచి ప‌టాన్ చెరు వ‌ర‌కు ఉన్న 1500 ఎంఎం డ‌యా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు భారీ లీకేజీల ఏర్పడటంతో పెద్ద ఎత్తున వాటర్ వృధాగా పోతోంది. దీంతో ఈ లీకేజీల‌ను అరిక‌ట్టేందుకు జలమండలి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఈ నెల మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్ట‌నున్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లో పైపులకు భారీ లీకులు పడ్డాయి.. దీంతో 24 గంట‌ల పాటు ఈ పైపుల పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్, మరికొన్ని ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు. ఓ అండ్ ఎం డివిజ‌న్ 15- ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్.. ఓ అండ్ ఎం డివిజ‌న్ 24 – బీరంగూడ‌, అమీన్ పూర్, ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్ 2 – ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు. ఓ అండ్ ఎం డివిజ‌న్ 6 – ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్.
ఓ అండ్ ఎం డివిజ‌న్ 9 – కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, మూసాపేట్, జ‌గ‌ద్గిరిగుట్ట‌. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన మంచినీటిని స్టోర్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పొదుపుగా నీటిని వినియోగించుకొని మరమ్మత్తు పనులకు సహకరించాలని కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.