ఫోన్‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు
బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ చూపిన మానవత్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. ఆకలితో ఉన్న యువతి ఆవేదన విని, వెంటనే ఆమె కోసం శాండ్‌విచ్ తీసుకొచ్చాడు. డ్రైవర్ మంచితనానికి యువతి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. కరుణ చూపడానికి భాష అవసరం లేదని, మంచి మనసు ఉంటే చాలని నిరూపించాడు. ఇది అసలైన భారతీయత అంటూ నెటిజన్లు ప్రశంసించారు.
బెంగళూరులో ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో గొడవ పడే వార్తలు ఎక్కువగా చూస్తుంటాం. తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్ చూపిన మానవత్వం ప్రస్తుతం సోషల్ మీడియాలో హృదయాలను కదిలిస్తోంది. ఓ యువతి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముంబయికి చెందిన ఓ యువతి బెంగళూరులో క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా, ఫోన్‌లో తన స్నేహితురాలితో మాట్లాడుతూ, తనకు ఎంతో ఆకలిగా ఉందని , ఉదయం నుంచి ఏమీ తినలేదని, రాత్రి 2 గంటలకు ఫ్లైట్ ఉందనీ, ఇక ఇప్పుడేం తింటాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాటలు విన్న క్యాబ్ డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుకి పక్కన ఆపాడు. కొన్ని నిమిషాల్లో శాండ్‌విచ్‌తో తిరిగి వచ్చి ఆమెకు ఇచ్చాడు. తన అక్క ఆకలితో ఉంటే తనకు ఎలా అనిపిస్తుందో.. అదే భావనతో తీసుకొచ్చాను అని ఆమెకు సమాధానం చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. డ్రైవర్ చూపిన ప్రేమ, అనురాగానికి యువతి కళ్లలో నీళ్లు ఆగలేదు. ఈ మంచితనాన్ని తను జీవితాంతం మరచిపోను అంటూ హృదయపూర్వకంగా డ్రైవర్‌కు థ్యాంక్స్ చెప్పినట్లు తన స్టోరిని నెటిజన్‌లతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్రైవర్ చూపించిన చొరవకు నెటిజన్‌లు ఫిదా అయ్యారు. కరుణ చూపడానికి భాష అవసరం లేదని, మంచి హృదయం ఉంటే చాలని ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలెట్‌గా నిలిచింది. ఇది అసలైన భారతదేశం అని నెటిజన్‌లు కామెంట్ల రూపంలో తెలియజేశారు. యువతి మాటలు విని డ్రైవర్ చేసిన పనితో తన మనసు గెలిచాడని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి
Andhra Pradesh: ఏపీలో స్మార్ట్ కార్డ్.. ఆధార్‌ను మించి..
గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం
అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ
బైకర్‌ను ఆపిన ట్రాఫిక్ పోలీస్.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్
