Building colapsed: చూస్తుండగానే పేక మేడలా కూలిపోయిన భవనం.! భయంతో జనం.. వీడియో

|

Dec 12, 2022 | 8:35 AM

కారణమేదైనా భవనాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఒక్కోసారి ఇలాంటి ప్రమాదంలో ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది. తాజాగా ఢిల్లీలో ఓ నాలుగంతస్తుల బిల్డింగ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.


దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్‌ 5 ఉదయం ఓ భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రీ నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు, అగ్ని మాపక విభాగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌ సాయంతో స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదాన్ని గ్రహించి ముందుగానే భవనాన్ని ఖాళీ చేయించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భవనాన్ని కూల్చాలని గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. భవనం కూలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 12, 2022 08:35 AM