Chocolate Hair Style: నవ వధువు హెయిర్ స్టయిల్ చూసి జనాలు షాక్..! స్టైల్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.. వీడియో.
వివాహ సమయంలో వధూవరులు ఎంతో అందంగా కనబడాలని కోరుకుంటారు. అందుకు బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకూ ఎంతో కేర్ తీసుకుంటారు. తమ వెడ్డింగ్ లుక్ వెరైటీగా ఉండేందుకు ఏం చేయడానికైనా వెనుకాడరు.
తమ పెళ్లి వేడుకలో అందంగా ప్రత్యేకంగా కనిపించాలని భావించిన ఓ నవవధువు వినూత్నంగా ఆలోచింది. సాధారణంగా పెళ్లిలో వధువుకి పూలజడ చాలా ప్రత్యేకం. అమ్మాయికి అందంగా పొడవాటి జడ వేసి పూలతో అలంకరిస్తారు. కానీ ఈ వధువు కాస్త వినూత్నంగా ఆలోచించి, చాక్లెట్స్‌తో కేశాలంకరణ చేసుకుంది. ఇయర్ రింగ్స్, నెక్లెస్ వంటి ఆభరణాలు కూడా చాక్లెట్లతో చేసినవే ధరించింది. ఈ పెళ్లికూతురి అలంకరణ చూసిన అతిథులు, బంధువులు షాకయ్యారు. ఇదేం విడ్డూరం… అంటూ ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 50 లక్షలమందికి పైగా వీక్షించారు. నెటిజన్లు సైతం వధువు హెయిర్‌స్టయిల్ చూసి షాకయ్యారు. అయితే వధువు చేసిన పనికి వారంతా భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..