Funny in wedding: పెళ్లిలో అబ్బాయిని ఆటపట్టిద్దామనుకుంది… కానీ సీన్‌ రివర్స్‌ అయి.. నవ్వులు పూయిస్తున్న వీడియో…

Updated on: Feb 25, 2022 | 9:31 AM

Funny incident on wedding: పెళ్లి వేడుకలో బంధువులు.. స్నేహితులతో ఎంతో సందడిగా ఉంటుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వివాహ వేడుకలో ప్రతి చిన్న క్షణాన్ని ఆనందంగా గడిపేస్తుంటారు. ఇటీవల పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Funny incident on wedding: పెళ్లి వేడుకలో బంధువులు.. స్నేహితులతో ఎంతో సందడిగా ఉంటుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వివాహ వేడుకలో ప్రతి చిన్న క్షణాన్ని ఆనందంగా గడిపేస్తుంటారు. ఇటీవల పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫన్నీ వీడియో చక్కర్లు కొడుతుంది. నిజమే.. ఆ వీడియో చూస్తే మీరు పొట్టచెక్కలయ్యేలా నవ్వడం మాత్రం ఖాయం. ఈ వీడియోలో పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరుగుతుంది. వధువు కూర్చుని ఉండగా.. ఆమె చుట్టూ బంధువులు.. స్నేహితులు ఉన్నారు. అలాగే అక్కడే ఉన్న పురోహితుడు వరుడి చేతులతో వధువుకు సింధూరం పెట్టే ఘట్టాన్ని జరిపిస్తున్నాడు. అయితే వరుడు.. వధువు తలపై కుంకుమ పెట్టడానికి అతను ముందుగు వచ్చినప్పుడు అక్కడే ఉన్న ఓ అమ్మాయి ఆకస్మాత్తుగా వరుడి మెడలో వరమాల వేయడానికి ప్రయత్నించింది. దీంతో వరుడు ఒక్కసారిగా వెనకకు జరిగాడు. ఇంకేముంది.. పురోహితుడు.. వధువు పై నుంచి ఆ అమ్మాయ బొక్క బోర్లా పడింది. ఈ ఘటనతో అక్కడున్నవారు పగలబడి నవ్వారు. అయితే ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరూ చూసేయ్యండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..

Published on: Feb 25, 2022 09:30 AM