Boy Stuck in Lift: లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు.. కూల్‌గా ఓ 2 గం. ఏం చేసాడంటే..? వీడియో.

|

Aug 25, 2023 | 9:11 PM

సాధారణంగా మనం లిఫ్ట్‌ లో ఇరుక్కున్నప్పడు ఆందోళనకు గురవుతాం. అదే చిన్నపిల్లలు చిక్కుకుపోతే తీవ్రంగా భయపడిపోతారు. ఏడుస్తారు. హర్యానాలో ఓ 8 ఏళ్ల బాలుడు కూడా అలాగే లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గ్రేటర్‌ ఫరీదాబాద్‌లోని సెక్టార్‌ 86లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పవన్‌ చండీలా కుటుంబం నాలుగో అంతస్తులో నివాసముంటోంది. వీరి ఎనిమిదేళ్ల కుమారుడు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండే టీచర్‌ దగ్గరికి ట్యూషన్‌కు వెళ్తుంటాడు.

సాధారణంగా మనం లిఫ్ట్‌ లో ఇరుక్కున్నప్పడు ఆందోళనకు గురవుతాం. అదే చిన్నపిల్లలు చిక్కుకుపోతే తీవ్రంగా భయపడిపోతారు. ఏడుస్తారు. హర్యానాలో ఓ 8 ఏళ్ల బాలుడు కూడా అలాగే లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గ్రేటర్‌ ఫరీదాబాద్‌లోని సెక్టార్‌ 86లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పవన్‌ చండీలా కుటుంబం నాలుగో అంతస్తులో నివాసముంటోంది. వీరి ఎనిమిదేళ్ల కుమారుడు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండే టీచర్‌ దగ్గరికి ట్యూషన్‌కు వెళ్తుంటాడు. ట్యూషన్‌ వద్ద రోజూ బాలుడి తల్లే దిగబెడుతుండగా.. ఆదివారం సాయంత్రం ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడంతో చిన్నారి ఒక్కడే బయల్దేరాడు. కిందకు దిగేందుకు అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌ ఎక్కగా.. ఉన్నట్టుండి రెండో అంతస్తులో అది ఆగిపోయింది. తొలుత కాస్త కంగారుపడిన బాలుడు.. లిఫ్ట్‌ డోర్ వద్ద నిలబడి సాయం కోసం అరిచాడు. కానీ, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో బాలుడిని గమనించలేదు. కొంతసేపు వేచి చూసిన ఆ చిన్నారి చేసేదేం లేక.. బ్యాగు తెరిచి అక్కడే హోంవర్క్‌ చేసుకున్నాడు.

గంటైనా చిన్నారి ట్యూషన్‌కు రాకపోవడంతో టీచర్‌.. వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు గురై సొసైటీ అంతా వెతికారు. అయినా ఎక్కడా కన్పించకపోవడంతో అనుమానం వచ్చి లిఫ్ట్‌ వద్దకు వెళ్లారు. చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినట్లు తెలుసుకుని వెంటనే లిఫ్ట్‌ సిబ్బందికి ఫోన్‌ చేశారు. లిఫ్ట్‌కు మరమ్మతు చేసిన అనంతరం తీరా డోర్‌ తెరిచి చూడగా బాలుడు తాపీగా హోంవర్క్‌ రాసుకుంటూ కన్పించాడు. దాదాపు రెండు గంటల తర్వాత చిన్నారి లిఫ్ట్‌ నుంచి బయటకు రాగలిగాడు. అతడు క్షేమంగానే ఉన్నాడని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...