పాము కాటుకు 76 ఇంజెక్షన్లు! ఏం జరిగిందంటే
ఓ బాలుడికి పాము కరవగా డాక్టర్లు ఏకంగా 76 ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు ఇంత ఎక్కువ మొత్తంలో ఇంజెక్షన్లు ఎవరికీ చేసుండకపోవడంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు బాలుడికి ఇన్ని ఇంజెక్షన్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ జిల్లా ఉదయ్‌పూర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల కరన్ అనే బాలుడు.. తన కుటుంబంతో కలిసి కట్టెలు సేకరించడానికి వెళ్లాడు.
అనుకోకుండా అతడిని నాగుపాము కాటు వేసింది. వెంటనే తల్లిదండ్రులు వెంటనే బాలుడికి పాము కరిచిన చోట కట్టు కట్టారు. విషం ఒళ్లంతా పాకకుండా ఉండాలని అలా చేశారు. అంతేకాకుండా పామును వెతికి మరీ చంపేశారు. దాన్ని ఓ కవర్లో వేసుకుని మోటార్ సైకిల్‌పై బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పామును గుర్తు పట్టడం ద్వారా సరైన యాంటీ-వెనమ్ ఇవ్వడం సులభమవుతుందని ఉద్దేశంతోనే చంపిన పామును వారు వెంట తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి వెళ్లేలోపే బాలుడికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. శరీరమంతా విషం వేగంగా వ్యాపిస్తున్న సంకేతాలు కనిపించాయి. సమయానికి స్పందించిన జిల్లా ఆసుపత్రిలోని వైద్య అధికారి డాక్టర్ హరి మాధవ్.. వెంటనే బాలుడికి చికిత్స ప్రారంభించారు. మొదట రెండు యాంటీ-వెనమ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. కానీ బాలుడి ఆరోగ్యం మెరుగైనట్లు కనిపించకపోవడంతో డాక్టర్ మరిన్ని ఇంజెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రెండు గంటల వ్యవధిలో ప్రతి ఒకటిన్నర నిమిషాలకు ఒక ఇంజెక్షన్ చొప్పున మొత్తం 76 ఇంజెక్షన్లు ఇచ్చారు. ఈ చికిత్స మొత్తం కొనసాగింది. ఒక్క పాము కాటుకు ఇంత భారీ స్థాయిలో యాంటీ-వెనమ్ ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇందుకు ఆసుపత్రిలో తగినంత యాంటీ-వెనమ్ సరఫరా అందుబాటులో ఉండటం ఒక వరం లాంటిదని వైద్యులు తెలిపారు. డాక్టర్ల సకాలంలో చేసిన ఈ ప్రయత్నమే బాలుడి ప్రాణాలను నిలిపిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కరన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే అతను అందరితోనూ మాట్లాడ గలుగుతున్నప్పటికీ.. ఇంకా అలసటగానే ఉన్నాడని వివరించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలుడు త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది కదా.. అసలైన పేరెంటింగ్ అంటే.. కూతురికి జీవిత పాఠాలు నేర్పుతున్న తండ్రి
EPFO: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్
Jio Recharge Plan: రిలయన్స్ జియో ఈ ప్లాన్ కూడా నిలిపివేసిందా?