Black Magic: కాలేజీ బస్సులో నిమ్మకాయలు, ముగ్గులు.. హడలిపోయిన విద్యార్థులు..!

Updated on: Feb 22, 2023 | 9:20 PM

ఏలూరు జిల్లాలో నూజివీడు సమీపంలో కాలేజీ బస్సులో క్షుద్ర పూజలు కలకలంరేపాయి. చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం సమీపంలో విసన్నపేటకు చెందిన వికాస్ కాలేజీ బస్సు నిలిచిఉంది.

ఏలూరు జిల్లాలో నూజివీడు సమీపంలో కాలేజీ బస్సులో క్షుద్ర పూజలు కలకలంరేపాయి. చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం సమీపంలో విసన్నపేటకు చెందిన వికాస్ కాలేజీ బస్సు నిలిచిఉంది. ప్రతి రోజూ కృష్ణారావుపాలెం సెంటర్ ఆంజనేయస్వామి గుడి దగ్గర పార్కింగ్ చేస్తారు. అయితే స్కూల్ బస్సులో నిమ్మకాయలు, అన్నంముద్దలు, ముగ్గులు వేసి అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు.నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అన్నం ముద్దలతో పూజలు చేసిన ఆనవాళ్లు చూసి కాలేజ్‌కు వెళదామని బస్సు ఎక్కడానికి వచ్చిన విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. వికాస్ కాలేజీ యజమాన్యం మరొక బస్సు పంపించి విద్యార్థులను అక్కడి నుంచి స్కూలుకు తరలించారు. ఎవరినైనా భయపెట్టడానికి ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 22, 2023 09:20 PM