గడ్డివాములో నల్లత్రాచు హల్‌చల్.. భయంతో జనం పరుగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చలి, వర్షాలకు గడ్డివాములోకి చేరిన నల్లత్రాచు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. మహిపాల్ చెరువు గ్రామంలో రైతు ఇంటి వద్ద ఈ ఘటన జరిగింది. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ చాకచక్యంగా పామును బంధించి సురక్షితంగా రక్షించాడు. శీతాకాలంలో పాములు వెచ్చదనం కోసం జనావాసాల్లోకి వస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఓవైపు చలి, మరోవైపు వర్షాలతో అడవుల్లో ఉండాల్సిన పాములు వెచ్చదనం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కోసారి పాముకాట్లకు గురైన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ నల్లత్రాచు జనాలను పరుగులు పెట్టించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామంలో నల్లత్రాచుపాము స్థానికులను పరుగులు పెట్టించింది. బొక్కా చంద్రరావు అనే రైతు శనివారం రాత్రి ఇంటి సమీపంలోని గడ్డివాము నుంచి పశువులకోసం వరిగడ్డిని దూస్తుండగా వింత శబ్ధాలు వినిపించాయి. కొన్ని క్షణాల తర్వాత బ్యాటరీ లైట్ వెలుగులో గడ్డి లాగుతూ ఉన్న చంద్రరావు కాస్త దూరంగా జరిగి ఏంటా అని చప్పుడు వస్తున్న వైపు పరిశీలనగా చూశాడు. అంతే.. ఓ పెద్ద నల్లత్రాచుపాము బస్సుమని వేగంగా ముందుకు వచ్చింది. దానిని చూసి బయపడిన చంద్రారావు.. వెంటనే అక్కడినుంచి ఇంటివైపు పరుగెత్తాడు. ఈ విషయం చుట్టుపక్కలవారికి తెలియడంతో అందరూ అక్కడ గుమిగూడారు. కొందరు స్థానిక స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న వర్మ ఎంతో చాకచక్యంగా ప్రమాదరకరమైన ఆ నల్లత్రాచును డబ్బాలో బంధించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలను స్థానిక వ్యక్తి వీడియో తీశారు. వీడియోలో నల్లత్రాచు పడగవిప్పుతూ.. రెండు నాలుకలు కలిగి బుసలుకొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. శీతాకాలంలో వెచ్చదనం కోసం పాములు గడ్డివాముల్లో చేరుతుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్నేక్ క్యాచర్ గణేష్ తెలిపాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెంపుడు కుక్కకు మత్తు మందు ఇచ్చి మరీ.. ఆలా.. ఎలా చేశారురా..
రూ.26 వేల జీతం.. రూ.70 వేల ఐఫోన్.. మండిపడుతున్న నెటిజన్లు
Samantha: నిశ్చితార్థం ఎప్పుడో చేసుకుంది! కాకపోతే హింట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలే
