Bike Theft: కొట్టేసిన బైక్ ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియక భలే దొరికిపోయాడు.!

|

Jan 29, 2024 | 12:08 PM

దొంగతనానికి ప్లాన్ చేసేటప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్, ఎస్కేప్, అయ్యేందుకు పక్కా ప్లాన్‌తో ఏ దొంగైనా స్కెచ్ వేస్తాడు. కానీ ఇక్కడ ఒక దొంగ.. దొంగతనం చేయడం ఒక్కటే ప్లాన్ చేసినట్టున్నాడు. ఎలా ఎస్కేప్ అవ్వాలో మర్చిపోయి భలే విచిత్రంగా దొరికిపోయాడు. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు ఓ దొంగ. బైక్‌ను అయితే చోరీ చేశాడు ఆ దొంగ.. కానీ ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే లాజిక్ మిస్ అయినట్టున్నాడు.

దొంగతనానికి ప్లాన్ చేసేటప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్, ఎస్కేప్, అయ్యేందుకు పక్కా ప్లాన్‌తో ఏ దొంగైనా స్కెచ్ వేస్తాడు. కానీ ఇక్కడ ఒక దొంగ.. దొంగతనం చేయడం ఒక్కటే ప్లాన్ చేసినట్టున్నాడు. ఎలా ఎస్కేప్ అవ్వాలో మర్చిపోయి భలే విచిత్రంగా దొరికిపోయాడు. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు ఓ దొంగ. బైక్‌ను అయితే చోరీ చేశాడు ఆ దొంగ.. కానీ ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే లాజిక్ మిస్ అయినట్టున్నాడు. దీంతో పారిపోయే క్రమంలో ఓ కిరాణా షాపులోకి బైక్ తో సహా దూరిపోయాడు.

మామిళ్ల కుంట క్రాస్ వద్ద షాపులోకి దూరిన దొంగ.. ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. దొంగతనం చేయడానికి ధైర్యం కోసం మందు తాగాడట. కానీ ఆ బైకును దొంగతనం చేసి ఎలా తీసుకెళ్లాలో? ఎటు పారిపోవాలో తెలియక.. ఓ వైపు జనం వెంట పడుతుంటే ఏకంగా కిరాణా షాపులోకి దూరిపోయాడు. ఇంకేముంది స్థానికులు, షాపు నిర్వాహకుడు దొంగను పట్టుకుని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos