Bike Theft: తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.

|

Jun 18, 2024 | 11:41 AM

ఏ విద్యలోనైనా ఎంతటి ఆరితేరినవారైనా ఒక్కోసారి ఫెయిల్‌ అవుతూ ఉంటారు. దొంగలు కూడా అంతే.. చోరకళలో పట్టాలు పొందినా.. పొరపాటో.. గ్రహపాటో ఒక్కోసారి ఇలా దొరికిపోతుంటారు. బైకులు దొంగతనం చేయడంలో ఆరి తేరిపోయిన దొంగలు.. పదుల సంఖ్యలో బైకులను ఎంతో చాకచక్యంగా కొట్టేశారు.. చోర కళలో ఇక మనకు తిరుగులేదనుకున్నారు. అదే కాన్ఫిడెన్స్‌తో.. మరో బైక్‌ కొట్టేయడానికి దొంగ తాళాలతో బైక్ స్టార్ట్ చేసి ఉడాయించారు.

ఏ విద్యలోనైనా ఎంతటి ఆరితేరినవారైనా ఒక్కోసారి ఫెయిల్‌ అవుతూ ఉంటారు. దొంగలు కూడా అంతే.. చోరకళలో పట్టాలు పొందినా.. పొరపాటో.. గ్రహపాటో ఒక్కోసారి ఇలా దొరికిపోతుంటారు. బైకులు దొంగతనం చేయడంలో ఆరి తేరిపోయిన దొంగలు.. పదుల సంఖ్యలో బైకులను ఎంతో చాకచక్యంగా కొట్టేశారు.. చోర కళలో ఇక మనకు తిరుగులేదనుకున్నారు. అదే కాన్ఫిడెన్స్‌తో.. మరో బైక్‌ కొట్టేయడానికి దొంగ తాళాలతో బైక్ స్టార్ట్ చేసి ఉడాయించారు. అయితే ఆ బైక్‌లో పెట్రోలు ఉందో లేదో చూసుకోవాలి కదా.. దొంగలు పారిపోతూ పెట్రోల్ చూసుకోవడం మర్చిపోయారు… ఇంకేముంది బైక్ దొంగతనం చేస్తూ పారిపోతూ పెట్రోల్ అయిపోవడంతో స్థానికుల చేతికి చిక్కి చావు దెబ్బలు తిన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని దొంగలించి పారిపోతున్న ఇద్దరు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు.. పోలీసులకు అప్పగించారు. అర్ధరాత్రి కదిరిలో ద్విచక్ర వాహనం దొంగిలించి పారిపోతుండగా పులగంపల్లి వద్దకు వచ్చేసరికి పెట్రోల్ అయిపోవడంతో దొంగలు దొరికిపోయారు. పెట్రోలు అయిపోయిన బైక్ను తోసుకుంటూ వెళుతున్న దొంగల తీరు అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు వారిని నిలదీశారు. వారి సమాధానాలు తేడాగా అనిపించడంతో అప్రమత్తమైన స్థానికులు ఇద్దరు దొంగలను పట్టుకుని స్తంభానికి కట్టేసి నాలుగు తగించారు. దాంతో అసలు విషయం చెప్పారు దొంగలు. బైకు దొంగతనం చేసి పారిపోతుండగా పెట్రోల్ అయిపోవడంతో దొరికిపోయారని తెలియడంతో.. పోలీసులకు పని తగ్గింది అనుకున్నారు. దొంగతనం చేసేటప్పుడే పక్కా ప్లాన్, స్కెచ్ వేసుకొని వెళ్లే ఈ కుర్ర దొంగలు.. పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా.? ఇప్పటి నుంచి బైకు దొంగతనాలు అరికట్టాలంటే.. బైక్ లో పెట్రోల్ లేకుండా చేస్తే చాలు దొంగలు ఇట్టే దొరికిపోతారు అని నవ్వుకుంటున్నారు స్థానికులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on