కుక్కకు.. రెసిడెన్స్ సర్టిఫికెట్ వీడియో
ఒక మనిషి ఫలానా ప్రాంతంలో నివసిస్తున్నాడు అనేందుకు మన అధికారులు రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారు. ఈ సర్టిఫికెట్ విద్య, ఉపాధి, తరతర పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే బీహార్ లోని అధికారులు ఏకంగా ఒక కుక్కకు నివాస ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. అంతేకాకుండా ఆ సర్టిఫికెట్ ను సర్కార్ వెబ్‌సైట్ లో పెట్టడంతో అధికారుల నిర్వాహకం అందరికీ తెలిసిపోవడమే కాక తీవ్రమైన రాజకీయ వివాదానికి మూలమైంది.
పాట్నా జిల్లాకు చెందిన మాసౌర్హి పట్టణ అధికారులు డాగ్ బాబు అనే పేరుతో డిజిటల్ రూపంలో రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేశారు. సదరు దరఖాస్తుదారుడి తండ్రి పేరు కుట్టా బాబు. తల్లి పేరు కుట్టియా దేవి అని ప్రస్తావిస్తూ సంబంధిత ఏరియా వివరాలతో రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. అయితే దరఖాస్తుదారుడి ఫోటో స్థానంలో కుక్క బొమ్మ ఉన్న సంగతి మరిచి దాని డిజిటల్ కాపీని ప్రభుత్వ పోర్టల్ లో అందుబాటులో ఉంచారు. దీంతో ఈ విషయం వార్తలకు ఎక్కడంతో పాటు బీహార్ లోని విపక్షాలు భగ్గుమన్నాయి. నితీష్ ప్రభుత్వ అసమర్థతకు ఇది రుజువు అని వారు ఆరోపించారు. బీహార్ లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ జాబితాలపై వివాదం వేళ ఈ కుక్క వివాదం విపక్షాలకు ఆయుధంగా మారింది. ఓటర్ జాబితా సవరణ అనేది ప్రజలకు ఓటు హక్కును నిరాకరించే కుట్ర అని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
మరిన్ని వీడియోల కోసం :