అమ్మ బాబోయ్..! రెస్టారెంట్ వద్ద చుక్కలు చూపించిన ఫైథాన్ వీడియో
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఒక భారీ కొండచిలువ హల్చల్ చేసింది. జూలై 27, ఆదివారం రాత్రి హుజూరాబాద్ జూనియర్ కళాశాల సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద 8 అడుగుల కొండచిలువ కనిపించటంతో జనం భయంతో కేకలు వేస్తూ పరారయ్యారు. ఎక్కడో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కొండ చిలువ.. జనవాసాల్లోకి రావడంతో వారంతా షాక్ గురయ్యారు. కాసేపటికి తేరుకొని కర్రలతో శబ్దాలు చేస్తూ..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఒక భారీ కొండచిలువ హల్చల్ చేసింది. జూలై 27, ఆదివారం రాత్రి హుజూరాబాద్ జూనియర్ కళాశాల సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద 8 అడుగుల కొండచిలువ కనిపించటంతో జనం భయంతో కేకలు వేస్తూ పరారయ్యారు. ఎక్కడో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కొండ చిలువ.. జనవాసాల్లోకి రావడంతో వారంతా షాక్ గురయ్యారు. కాసేపటికి తేరుకొని కర్రలతో శబ్దాలు చేస్తూ.. దానిని అక్కడి నుంచి తరిమేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే, అలా శబ్దాలు చేస్తున్న వారి మీదికి కొండ చిలువ దూసుకొచ్చేందుకు ప్రయత్నించటంతో జనం తలోదిక్కూ పారిపోయారు. దీంతో వారు స్నేక్ క్యాచర్, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్, అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే, ఆ భారీ సైజు కొండచిలువ వారికి కాసేపు చుక్కలు చూపించింది. చివరకు అతి కష్టం మీద అటవీశాఖ అధికారులు దానిని బంధించి.. అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. దీంతో స్థానికులంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
నీ కష్టం పగోడికి కూడా రావద్దు బ్రో .. వైరల్ అవుతున్న వీడియో
ఇదెక్కడి ఆచారం.. ఆ దుమ్ము,ధూళితో రోగాలన్నీ మాయం వీడియో
రేయ్ ఎంత పని చేసార్రా.. గబ్బిలాల మాంసంతో చిల్లీ చికెనా? వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

