Viral Video: దెబ్బ అదుర్స్ కదూ..! భార్య మరో వ్యక్తితో పరార్.. అతని భార్యనే పెళ్లాడిన బాధితుడు..
బీహార్‌లోని ఖగారియాలో వింత ఘటన జరిగింది. తన భార్యతో పరారైన వ్యక్తి భార్యను పెళ్లాడి కసి తీర్చుకున్నాడో వ్యక్తి. జిల్లాలోని ఛౌథామ్ బ్లాక్‌లోని హార్డియా గ్రామానికి చెందిన ముకేశ్
బీహార్‌లోని ఖగారియాలో వింత ఘటన జరిగింది. తన భార్యతో పరారైన వ్యక్తి భార్యను పెళ్లాడి కసి తీర్చుకున్నాడో వ్యక్తి. జిల్లాలోని ఛౌథామ్ బ్లాక్‌లోని హార్డియా గ్రామానికి చెందిన ముకేశ్ అనే వ్యక్తి నీరజ్ అనే మరో వ్యక్తి భార్యతో పరారయ్యాడు. అయితే పారిపోయిన ఇద్దరూ ముఖేష్, రూబీ పెళ్లికి ముందే ప్రేమించుకున్నారు. వివాహం తర్వాత కూడా వారి మధ్య పరిచయం కొనసాగింది.ప్రేమించుకున్న ఈ ఇద్దరు పెళ్లి ఎందుకు చేసుకోలేదో కానీ, ఇద్దరూ వేరే వ్యక్తులతో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ వివాహాలు జరిగినా పరిచయం మాత్రం కొనసాగించారు. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో ముకేశ్, నీరజ్ భార్య, తన ప్రియురాలు అయిన రూబీతో పరారై వివాహం చేసుకున్నాడు. అప్పటికే నీరజ్‌కు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. తన భార్య రూబీ ముకేశ్‌తో వెళ్లిపోవడంపై నీరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్దలు కూడా పంచాయితీ పెట్టి ముకేశ్‌తో మాట్లాడారు. అయినప్పటికీ నీరజ్ భార్యను విడిచిపెట్టేందుకు ముకేశ్ అంగీకరించలేదు. దీంతో ముకేశ్‌పై పగ పెంచుకున్న నీరజ్ అతని భార్యతో పరిచయం పెంచుకున్నాడు. అన్నట్టు ముఖేష్ భార్య పేరుకూడా రూబీనే కావడం విశేషం. ఈ క్రమంలో ఫిబ్రవరి 18న స్థానిక ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ముకేశ్ రోజు కూలీ కాగా, నీరజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

