పెళ్లి వేదికపై ఉన్న వరుడి కిడ్నాప్‌.. ఏం జరిగిందంటే వీడియో

Updated on: May 27, 2025 | 1:51 PM

బీహార్ లో షాకింగ్ సంఘటన జరిగింది. గోపాల్ గంజ్ లో ఒక పెళ్లి వేదికపై వివాహం జరుగుతుంది. బంధువులంతా పెళ్లి వేడుకను వీక్షిస్తున్నారు. ఇంతలో పెళ్లి మండపంలోకి కొందరు వ్యక్తులు దూసుకు వచ్చారు. నీరుగా పెళ్లి కుమారుడిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోయారు. ఊహించని పరిణామానికి బంధుమిత్రులంతా షాక్ తో చూస్తుండిపోయారు. ఈ సంఘటన మే 24 శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జరిగిందని పోలీసులు తెలిపారు. అసలు ఏం జరిగిందంటే అప్పటికే పెళ్లి తంతులో జయమాల వేడుక పూర్తయింది.

వధూవరులు ఇంకా వేదికపై కూర్చుని ఉన్నారు. పండితులు మంత్రాలు పఠిస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా దుండగులు చొరబడి వరుడిని తీసుకు వెళ్లిపోయారు. ఇదంతా సినిమా ఫిక్కిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే సురేంద్ర శర్మ కుమార్త వివాహం ఊరేగింపు బైకుంపూర్ లోని దిగ్వాబ్ దుబాయ్ నుండి వచ్చింది. పెళ్లికి వచ్చిన అతిథులను అలరించడానికి అబ్బాయి తరపు వారు లాండా డాన్స్ పార్టీని ఏర్పాటు చేశారు. పాటలు పాడుతూ న్యూత్యం చేస్తుండగా ఏదో ఒక విషయంపై వివాదం తలెత్తుతుంది. అది కాస్త హింసాత్మకంగా మారింది. గొడవ సమయంలో లాండా నాచ్ పార్టీకి చెందిన బృందం సభ్యులు వధువు ఇంటికి వద్దకు చేరుకొని అక్కడ ఉన్న వారిని కొట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో

నటికి మామ రూ. 2,209 కోట్ల కానుకలు వీడియో

70 ఏళ్ల వ్యక్తి గాల్ బ్లాడర్‌ లో 8,125 రాళ్లు! లెక్కపెట్టడానికి 6 గంటలు వీడియో