ఈమె పోలీసు ఆఫీసరే కాదు.. ఖతర్నాక్‌ దొంగ కూడా

Updated on: Nov 01, 2025 | 11:11 AM

ఎవరింట్లోనైనా దోపిడీలు, దొంగతనాలు జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. మరి ఆ పోలీసులే చోరీలకు పాల్పడితే.. అదికూడా స్నేహితుల ఇంట్లో.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది మధ్యప్రదేశ్‌లో. స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఓ మహిళా డీఎస్పీ తన ఫ్రెండ్‌ బ్యాగులోనుంచి పెద్దమొత్తంలో క్యాష్‌, ఆమె మొబైల్‌ ఫోన్‌ ఎత్తుకెళ్లిపోయింది.

బాధితురాలి ఫిర్యాదుతో ఆ మహిళా డీఎస్పీపై కేసు నమోదు చేసారు పోలీసులు. పోలీసుల వివరాలు ప్రకారం… భోపాల్‌లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు హెడ్‌క్వార్ట‌ర్స్‌లో క‌ల్ప‌నా ర‌ఘువంశీ డీఎస్పీగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఆమె ఏదో పనిమీద తన స్నేహితురాలి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఫ్రెండ్‌ స్నానానికి వెళ్లినట్టుగా గుర్తించిన కల్పన అక్కడే ఛార్జింగ్‌ పెట్టి ఉన్న మొబైల్‌ ఫోన్‌తోపాటు, హ్యాండ్‌ బ్యాగ్‌లోని రూ.2 లక్షల నగదును తీసుకొని వెళ్లిపోయారు. ఇదంతా ఆ ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డయింది. బాధితురాలు తిరిగి వచ్చి చూడగా, డబ్బు, ఫోన్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ ఫుటేజీలో డీఎస్పీ కల్పన ఇంట్లోకి రావడం, బయటకు వెళ్లడం స్పష్టంగా రికార్డయింది. ఆమె బయటకు వెళ్తున్నప్పుడు చేతిలో కరెన్సీ నోట్ల కట్ట పట్టుకుని ఉన్న దృశ్యాలు కూడా కనిపించాయి. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని కీలక ఆధారంగా తీసుకుని పోలీసులు డీఎస్పీ కల్పనపై దొంగతనం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న డీఎస్పీని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కానీ నగదు ఇంకా దొరకలేదు. డీఎస్పీ పరారీలో ఉన్నారని, ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే ఆమెను అరెస్టు చేస్తామని ADCP బిట్టు శర్మ తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన ఉన్నత అధికారి ఇలాంటి నేరానికి పాల్పడటం పోలీసులను షాక్‌కు గురిచేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార‌తీయుల‌కు అమెరికా మ‌రో బిగ్ షాక్‌

రయ్య్‌మంటూ దూసుకెళ్తున్న డ్రైవర్‌లెస్‌ కారు

Deepika Padukone: దీపికకు మరో షాకిచ్చిన కల్కి టీమ్

ఇదేం పని !! కర్నూలు బస్సు ప్రమాదం.. బూడిదలో బంగారం కోసం గాలింపు

స్వీట్స్‌ తయారీలో నిమగ్నమైన సిబ్బంది.. అంతలోనే ఊహించని సీన్‌