పంచెకట్టులో బౌండరీ షాట్స్‌.. పురోహితుల క్రికెట్‌ టోర్నమెంట్‌ అదుర్స్‌

Updated on: Dec 24, 2025 | 1:42 PM

భీమవరం డిఎన్‌ఆర్ కాలేజీ గ్రౌండ్‌లో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ సీజన్ 3 ఘనంగా ప్రారంభమైంది. మంత్రోచ్ఛారణలు చేసే అర్చకులు ఇప్పుడు బ్యాట్‌ పట్టి మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు నుండి 20 జట్లు పాల్గొంటున్నాయి. విజేతలకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ, రన్నర్‌కు 50 వేలు. పంచెకట్టులో ఆడుతున్న పురోహితుల ఆట స్థానికులను ఆకర్షిస్తోంది.

మంత్రోచ్ఛారణలు చేయడమే కాదు.. బ్యాట్‌ పట్టి మడతేస్తాం.. గంటకొట్టి భగవంతున్ని ప్రార్థించడమే కాదు.. బాల్‌పట్టి వికెట్లను ఎగరగొడతాం అంటున్నారు అర్చకులు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భీమవరం డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో ఈ నెల 21 నుండి 28 వరకూ పురోహిత క్రికెట్ లీగ్ సీజన్ 3 జరుగుతుంది. క్రికెట్ లీగ్ ను పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఎంపీ పాకా సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు కు చెందిన 20 పురోహిత జట్లు ఈ లీగ్ లో పాల్గొంటున్నాయి. మొత్తం 48 మ్యాచ్ లు ఆడనున్నారు. ఎప్పుడూ పంచె కట్టుతో దేవాలయాల్లో అర్చనలు చేసే పురోహితులు క్రికెట్ లీగ్ ఆడడం ఆశక్తిగా మారింది. పంచెకట్టులో క్రికెట్ ఆడుతున్న పురోహితుల ఆటను స్థానికులు ఆశక్తిగా తిలకిస్తున్నారు.పురోహిత క్రికెట్ లీగ్ సీజన్ 3 లో విజయం సాధించిన జట్టుకు లక్ష రూపాయలు ఫస్ట్ ప్రైజ్ గా ఇవ్వనున్నారు. రన్నర్ కు 50 వేలు నగదును ఇవ్వనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారి ఫ్యాన్ కు స్మృతి మంధాన రిప్లై టీ20ల్లో రికార్డు

వాట్సప్ యూజర్స్… బీ అలర్ట్… ఘోస్ట్‌ పెయిరింగ్‌‌కు చెక్ పెట్టండిలా

Dhurandhar: ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి! పాకిస్తానీల వింత డిమాండ్

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు

Champion: రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్

Published on: Dec 24, 2025 01:40 PM