Ramadasu Statue: 30 ఏళ్లుగా చెట్టుకిందనుంచి మందిరంలోకి చేరిన భక్తరామదాసు.!

|

Jan 29, 2024 | 12:46 PM

భద్రాద్రి రామునికి ఆలయం నిర్మించాలని ఎంతో తపనపడి, నిందలు మోసి స్వామివారికి ఆలయం నిర్మించిన భక్తరామదాసు చెట్టుకింద నీడలేకుండా పడిఉన్నాడు. ఎట్టకేలకు ఓ సామాజిక కార్యకర్త కంటిలో పడిన ఆ రామభక్తాగ్రేసరుడు రామదాసు ధ్యానమందిరానికి చేరి పూజలందుకుంటున్నాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఓ పురాతన విగ్రహాన్ని భక్త రామదాసు విగ్రహం గా గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు.

భద్రాద్రి రామునికి ఆలయం నిర్మించాలని ఎంతో తపనపడి, నిందలు మోసి స్వామివారికి ఆలయం నిర్మించిన భక్తరామదాసు చెట్టుకింద నీడలేకుండా పడిఉన్నాడు. ఎట్టకేలకు ఓ సామాజిక కార్యకర్త కంటిలో పడిన ఆ రామభక్తాగ్రేసరుడు రామదాసు ధ్యానమందిరానికి చేరి పూజలందుకుంటున్నాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఓ పురాతన విగ్రహాన్ని భక్త రామదాసు విగ్రహం గా గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు. ముప్పై సంవత్సరాలుగా స్టేషన్ ఆరుబయట ఉన్న విగ్రహాన్ని దేవుడి విగ్రహం గా భావించి ఓ చెట్టుకింద ఉంచి పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఫొటో తీసి పురావస్తు శాఖ అధికారులకు పంపించడంతో వారు నేలకొండపల్లికి వచ్చి పలు పరిశోధనలు చేసిన అనంతరం అది భక్తరామదాసు విగ్రహం గా గుర్తించారు.

గతంలో రామదాసు ధ్యాన మందిరం సమీపంలో పోలీస్ స్టేషన్ ఉండేది. స్టేషన్ నిర్మాణం చేసి చాలా సంవత్సరాలు కావడం తో కూలిపోయింది. దీంతో అధికారులు మరో చోట పోలీస్ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణం చేశారు. ఈక్రమంలో ఆ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి అధికారులు ఆరుబయట ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా పురావస్తు శాఖ అధికారులు ఆ విగ్రహాన్ని భక్తరామదాసు విగ్రహం గా గుర్తించారు. దీంతో రామదాసు ధ్యాన మందిరానికి విగ్రహాన్ని తరలించారు. రామదాసు వంశం పదోతరానికి చెందిన వారసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా భక్తరామదాసుకు సంబంధఙంచిన తొలి విగ్రహం ఇదేనని చరిత్ర కారులు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos