Wedding: భైంసా యువకుడు..బెంగళూరు యువతి.. రిక్షాలో వెళ్లి పూరీలో పెళ్లి.. వీడియో.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. తాజా పరిణామాలు చూస్తుంటే అదీ నిజమేననిపిస్తుంది. ఎందుకంటే, భారత దేశంలో పుట్టిన యువతీ యువకులు విదేశీయులను వివాహం చేసుకుంటున్నారు.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. తాజా పరిణామాలు చూస్తుంటే అదీ నిజమేననిపిస్తుంది. ఎందుకంటే, భారత దేశంలో పుట్టిన యువతీ యువకులు విదేశీయులను వివాహం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతోనో, మరో కారణంతోనో వివాహబంధానికి కాదేదీ అనర్హం అన్నట్టు దేశం, రాష్ట్రం, ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన ఓ యువకుడు పశ్చిమబెంగాల్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అదికూడా ఒడిస్సాలోని పూరీ జగన్నాథుని ఆలయంలో. ఇప్పుడు ఈ వివాహం చర్చనీయాంశగా మారింది.తెలంగాణలోరి నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శ్యాంసుందర్ మున్నా లడ్డా, మంజూ లడ్డాల కుమారుడు అంజు లడ్డాకు పశ్చిమ బెంగాల్ కు చెందిన సుభాష్ బియాని,శశి బియానిల కూతురు డింపుల్ తో పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో శ్యాం సుందర్ మున్నా లడ్డా తన కుమారుని వివాహాన్ని పూరీ జగన్నాథ ఆలయంలో జరిపించాలని అనుకున్నారు. ఇందుకు వధువు కుటుంబీకులు కూడా అంగీకరించడంతో , ఇరు కుటుంబాల వారు తమ బంధు, మిత్రులతో కలిసి జగన్నాథ ఆలయానికి తరలివెళ్లారు. ఇక ఫిబ్రవరి 23న వివాహానికి అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో వరుడు వధువును రిక్షాపై పెళ్లి వేదికకు తీసుకొచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. వధువు పూల బొకేలతో రిక్షాలోనిలుచుని ఉండగా వరుడు పెళ్లి దుస్తుల్లో రిక్షా లాగుతూ వధువును మహారాణిలా కళ్యాణవేదికకు తీసుకొని వెళ్లాడు. ఆ జగన్నాధుడి ఆశీస్సులతో వధూవరులు ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!