Woman Cab: ఇంటి అద్దెలో సగం క్యాబ్‌కే ధారపోస్తున్నట్లు మహిళ ఆవేదన.! వీడియో..
అద్దె ఎక్కువైనా పర్లేదు ఆఫీసుకు దగ్గర్లోనే ఉండేందుకు ఇష్టపడేది కొందరైతే.. జర్నీ పెరిగినా ఓకే ఇంటి అద్దె మిగిలితే చాలనుకునే వారు మరికొంతమంది. ఇలానే లెక్కలేసుకుని రోజూ ప్రయాణానికి సిద్ధపడిన ఓ యువతికి.. తీరా ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువ ఈ క్యాబ్‌కే ఖర్చవుతుందని వాపోతూ ఆమె పెట్టిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోవడం కంటె ఆఫీసుకి నడిచి వెళితే త్వరగా చేరుకుంటారని ఇటీవల గూగుల్ మ్యాప్స్ చూపించడం బెంగళూరు
అద్దె ఎక్కువైనా పర్లేదు ఆఫీసుకు దగ్గర్లోనే ఉండేందుకు ఇష్టపడేది కొందరైతే.. జర్నీ పెరిగినా ఓకే ఇంటి అద్దె మిగిలితే చాలనుకునే వారు మరికొంతమంది. ఇలానే లెక్కలేసుకుని రోజూ ప్రయాణానికి సిద్ధపడిన ఓ యువతికి.. తీరా ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువ ఈ క్యాబ్‌కే ఖర్చవుతుందని వాపోతూ ఆమె పెట్టిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోవడం కంటె ఆఫీసుకి నడిచి వెళితే త్వరగా చేరుకుంటారని ఇటీవల గూగుల్ మ్యాప్స్ చూపించడం బెంగళూరు ట్రాఫిక్ దుస్థితిని అద్దం పడుతోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంటే క్యాబ్‌లను ఆశ్రయించే వారే ఇక్కడ అధికం. వన్షిత కూడా అలానే రోజూ ఆఫీసుకెళ్లి వస్తోంది. ఈ క్రమంలో క్యాబ్ కోసం తాను ఎంత ఖర్చు చేస్తున్నదీ క్రెడ్ యాప్‌లో ట్రాక్ చేసింది. అందులో జులై 1 నుంచి 25 వరకు ఉబర్ క్యాబ్స్‌లో మొత్తం 74 ట్రిప్పులు తిరిగినట్లు అందులో కనిపించింది. దానికైన ఖర్చు అక్షరాలా రూ.16వేలు పైనే కావడంతో షాక్ తింది. తన ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువ క్యాబ్‌కే పోయాల్సి వస్తోందంటూ సంబంధిత స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది.
ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన కాసేపటికే ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీంతో కొందరు నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘ఇంతేసి ఖర్చు చేస్తున్నందుకు ఉబర్ మిమ్మల్ని సత్కరించాల్సిందే’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా.. ‘నెల నెలా అంతేసి ఖర్చు చేసే బదులు సొంతకారు కొనుక్కుని ఈఎంఐ చెల్లించడం మేలు’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ‘ఈ బాధలు పడలేకే నేనో టూవీలర్ తీసుకున్నా’ అంటూ మరో యూజర్ పేర్కొనగా.. ‘నా ఖర్చులు ట్రాక్ చేసి చూసుకునే క్రెడ్ ఓపెన్ చేసే ధైర్యం నాకు లేదు’ అంటూ మరో వ్యక్తి సరదాగా కామెంట్ పెట్టాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.