బయటి నుంచి వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకున్న వ్యక్తి.. కాసేపటికే నురగలు కక్కుతూ

Updated on: Sep 02, 2025 | 3:45 PM

బెంగళూరులో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందిన తీరు కంటతడి పెట్టిస్తోంది. కాలికి స్పర్శ లేకపోవడంతో తనను పాము కాటు వేసిందని గుర్తించని ఆ వ్యక్తి.. విధులు ముగించుకొని ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుండగా తాను ఎందుకు చనిపోతున్నానో కూడా తెలియని స్థితిలో నురగలు కక్కుకొని ప్రాణాలు వదిలాడు.

అయితే.. ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి గమనించి బాధితుడిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.షూలో నక్కిన పాము అతడిని కాటు వేయడంతోనే అతడు మృతిచెందినట్టు డాక్టర్లు నిర్థారించారు. కర్ణాటకలోని బన్నేరుఘట్ట రంగనాథ లేఅవుట్‌లో మంజుప్రకాశ్‌ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నివాసముంటున్నాడు. అతని వయస్సు 41 ఏళ్లు. 2016లో జరిగిన బస్సు ప్రమాదంలో అతని కాలుకి తీవ్ర గాయమైంది. ఆపరేషన్‌ చేసిన అనంతరం కాలు స్పర్శను కోల్పోయింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో పనిమీద బయటకు వెళ్లిన అతను ఇంటికి వచ్చి తన ఫుట్‌ వేర్‌ విప్పి ఇంట్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాసేపటికి అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నోట్లోంచి ననురుగలు కక్కుతూ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.అయితే.. అతని ఇంట్లో పనిచేసే వ్యక్తి వచ్చి మంజుప్రకాశ్‌ చెప్పుల పక్కన పాము చనిపోయి ఉండటం చూసి కంగారు పడ్డాడు. వెంటనే ఇంట్లోకి పరుగెత్తుకెళ్లి చూడగా మంజుప్రకాష్‌ పరిస్థితి చూసి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. మంజుప్రకాష్‌ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. షూలో పాము ఉండగానే వాటిని వేసుకుని వెళ్లి ఉండొచ్చిని, దాంతో అది కాటు వేసిందని, మంజు కాలికి స్పర్శ తెలియకపోవటంతో దానిని గుర్తించలేకపోయాడని వైద్యులు తెలిపారు. షూలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై కొన ఊపిరితో ఉన్న పాము బయటకు వెళ్లే క్రమంలో చనిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Earthquake: భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

ల్యాబ్‌లో తయారైన మానవ కిడ్నీ..ఆశ్చర్యంగా పని చేస్తోంది

త్వరలో ఆధార్ యాప్ ఇక.. ఆధార్ సెంటర్లకు బై బై

టెర్రస్ పై నుంచి దూకబోయిన ‘నీట్’ విద్యార్థిని.. చివరి నిమిషంలో

Rainfall Warning: మరో అల్పపీడనం.. వచ్చే 3 రోజులు వానలే వానలు