మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్

Updated on: Nov 27, 2025 | 5:18 PM

బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ తన కారులో అతికించిన రూల్స్ పోస్టర్ వైరల్‌గా మారింది. ప్రయాణికుల అగౌరవ ప్రవర్తనతో విసిగిపోయిన డ్రైవర్ పెట్టిన ఈ ఆరు నియమాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. 'భయ్యా' అని పిలవొద్దని, 'యాటిట్యూడ్‌ని జేబులో పెట్టుకోండి' వంటివి ప్రత్యేకంగా నిలిచాయి. ఈ పోస్ట్ ప్రజల నుండి మిశ్రమ స్పందన పొందింది.

బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ తన కారులో రూల్స్ పోస్టర్ అతికించడం వైరల్‌గా మారింది. ఈ మధ్యకాలంలో క్యాబ్‌ ఎక్కే ప్రయాణికుల ప్రవర్తనతో విసిగిపోయుంటాడని అందుకే రూల్స్‌ పోస్టర్‌ పెట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతను పెట్టిన రూల్స్ చూస్తే ఆశ్చర్యంతో షాకవ్వాల్సిందే! బెంగళూరులో ఓ వ్యక్తి ప్రయాణించిన క్యాబ్‌లో అతనికి డ్రైవర్ సీటు వెనక అతికించి ఉన్న పోస్టర్‌ కనిపించింది. దానిని ఫోటో తీసి రెడిట్ లో పోస్ట్ చేశాడు. క్షణాల్లో పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్టర్‌లోని ఆరు నిబంధనలు ఏంటంటే.. మొదటిది మీరు ఈ కారు యజమాని కాదు, రెండోది ఈ కారు నడుపుతున్న వ్యక్తి దీని యజమాని, మూడవది మర్యాదగా మాట్లాడండి, తిరిగి గౌరవం పొందండి, నాల్గవది కారు డోర్‌ను నెమ్మదిగా క్లోజ్‌ చేయండి. ఐదవది మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి. మాకు ఎక్కువ డబ్బులివ్వట్లేదు కాబట్టి అది మాకు చూపించవద్దు. ఆరవది మమ్మల్ని ‘భయ్యా’ అని పిలవొద్దు. వేగంగా నడపమని అడగవద్దని కూడా డ్రైవర్ రాసుకొచ్చాడు. ఈ నిబంధనలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. ఈ పోస్ట్‌ పై చాలా మంది యూజర్స్ స్పందించారు. నేను ఈ పోస్ట్‌ని సపోర్ట్‌ చేస్తున్నా .. ఎందుకంటే కొంతమంది క్యాబ్‌ను తమ సొంతబండిలా ఫీల్‌ అవుతారు అని ఒకరు, “మీ యాటిట్యూడ్‌ని మడిచి మీ జేబులో పెట్టుకోండి అనే లైన్‌ చూసి తెగ నవ్వుకున్నా అంటూ మరొకరు,. “షార్ట్‌కట్ ఉందా?” అని అడిగే వారికి ఈ పోస్టర్‌ సరైందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “అంతా బాగానే ఉంది కానీ ‘భయ్యా’ అని ఎందుకు పిలవకూడదో అర్థం కాలేదు అని మరొక యూజర్ రాసుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..

గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం