గూగుల్ ఆఫీసులో నల్లుల బెడద
అమెరికాలోని గూగుల్ సంస్థ టెకీలు ఇప్పుడు కంప్యూటర్లలోని బగ్స్ తో కాకుండా నల్లుల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా న్యూయార్క్‌లోని చెల్సీ క్యాంపస్‌లో నల్లులు వ్యాపించాయనే ఆందోళనతో ఆఫీసును తాత్కాలికంగా మూసేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. గూగుల్ ఇతర క్యాంపస్‌లలో కూడా తనిఖీలు నిర్వహించింది.
నల్లులకు సంబంధించి దురద లాంటి లక్షణాలు బయటపడితే వెంటనే తెలియచేయాలని గూగుల్ కోరింది. తమ డెస్క్‌లపై నల్లులు కన్పిస్తే వెంటనే కంపెనీ ఫెసిలిటీస్ టీమ్‌కు రిపోర్ట్ చేయాలని గూగుల్ ఉద్యోగులను కోరింది. ఇళ్లలో నల్లులు ఉన్నట్లు గుర్తిస్తే, పెస్ట్ కంట్రోల్ నిపుణులను సంప్రదించాలని సూచించింది. గూగుల్ న్యూయార్క్ ఆఫీసులో నల్లుల బెడద రావడం ఇది రెండోసారి. గతంలో 2010లో కూడా ఇలాగే జరిగింది. న్యూయర్క్ లోని 1913 నాటి గూగుల్ ఆఫీసు బిల్డింగ్‌లో పెద్ద మొత్తంలో స్టఫ్డ్ జంతువుల బొమ్మలు ఉండటం వల్లే ఇది వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. బెడ్ బగ్స్ ఇళ్ళు, హోటల్స్, సినిమా హాల్స్, రైళ్ళలో కూడా ఉంటాయి. ఇవి కుట్టడం వల్ల దురద, అలెర్జీ వంటి సమస్యలు రావచ్చు. వీటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. పట్టుకోలేం. ఎందుకంటే ఇవి పరుపు, బెడ్స్, ఫర్నీచర్ పగుళ్లలో దాక్కుంటాయి. రాత్రుళ్లలో బయటికొచ్చి కుట్టడం ద్వారా మనిషి రక్తాన్ని పీలుస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిషికేష్‌లో బామ్మ సాహసం.. ఆమె ఏం చేసిందంటే
దొంగల్లో ఖతర్నాక్ దొంగ.. హుండీని ఎలా కొల్లగొట్టాడు చూడండి
మీరు లాప్‌టాప్‌తో విమానాశ్రయానికి వెళుతున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి
