Ongole: మేకప్ చేస్తుండగా బ్యూటిషియన్‌పై దాడి..! ఎందుకో తెలుస్తే షాక్..!

|

Sep 07, 2023 | 10:15 PM

ప్రకాశం జిల్లా ఒంగోలులో పట్ట పగలే విచిత్రమైన దొంగతనం జరిగింది. మేకప్‌ కోసం వచ్చిన ముగ్గురు మహిళలు.. బ్యూటీషియన్‌పై యాసిడ్ వంటి ద్రావకంతో దాడి చేసి, క్లోరోఫాం చల్లి బంగారం, డబ్బుతో పారిపోవడం కలకలం రేపింది. నగరంలోని కర్నూలు రోడ్డు మహాలక్ష్మి కళ్యాణ మండపం సమీపంలో ఉన్న శ్రీకృష్ణ నగర్‌లో రజియా అనే మహిళ బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు గుర్తుతెలియని

ప్రకాశం జిల్లా ఒంగోలులో పట్ట పగలే విచిత్రమైన దొంగతనం జరిగింది. మేకప్‌ కోసం వచ్చిన ముగ్గురు మహిళలు.. బ్యూటీషియన్‌పై యాసిడ్ వంటి ద్రావకంతో దాడి చేసి, క్లోరోఫాం చల్లి బంగారం, డబ్బుతో పారిపోవడం కలకలం రేపింది. నగరంలోని కర్నూలు రోడ్డు మహాలక్ష్మి కళ్యాణ మండపం సమీపంలో ఉన్న శ్రీకృష్ణ నగర్‌లో రజియా అనే మహిళ బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు గుర్తుతెలియని మహిళలు బ్యూటీపార్లర్‌కు వచ్చి తమకు మేకప్ చేయాలని అడిగారు. బ్యూటీషియన్ వారిలో ఒకరికి ఫేషియల్‌ చేయించగా .. మరో మహిళ ఐ బ్రోస్‌ చేయించుకుంది. మూడో మహిళ వాష్‌రూమ్‌కు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత వాష్‌రూమ్‌కు వెళ్లిన మహిళ వచ్చీరాగానే తన వెంట తెచ్చుకున్న ద్రావకంతో బ్యూటీషియన్‌ రజియాపై దాడి చేసింది. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా, ద్రావకం కుడిభుజం, ముక్కుపై పడింది. మిగిలిన ఇద్దరు మహిళల సాయంతో రజియా మొహంపై క్లోరోఫాం చల్లిన కర్ఛీఫ్ ఉంచింది. రజియా స్పృహ కోల్పోగానే ఆమె ఒంటిపై ఉన్న ఇరవై సవరాల బంగారం, కౌంటర్‌లో ఉన్న రూ. 40 వేల నగదు తీసుకుని ముగ్గురు మహిళలు పరారయ్యారు. రజియా స్పృహ కోల్పోగా స్థానికులు ఆమెను హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల్ని గుర్తించేందుకు సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలో ముగ్గురు నిందితురాళ్లు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ముగ్గురు మహిళల ఆచూకీ కోసం స్పెషల్ పోలీసు బృందాలను రంగంలోకి దించారు. చోరీ చేసిన బంగారు ఆభరణాల విలువ రూ.10 లక్షలు ఉంటుందని బాధితురాలు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..